Manchu Vishnu : తన ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామాలపై మంచు విష్ణు(Manchu Vishnu) మీడియాతో మాట్లాడారు.. ఆయన మాట్లాడుతూ.. “ఇలా మాట్లాడాల్సి వస్తుంది.. ఇలాంటి సిట్యువేషన్ మాకు వస్తుందని ఊహించలేదు. మూడు తరాలుగా నాన్నగారు ఏంటి అనేది మీకు తెలుసు. ప్రతి ఇంట్లోనూ ఇష్యూస్ ఉంటాయి. అవి రిజాల్వ్ అవుతాయని పెద్దలు కోరుకుంటారు. నేను ఎమోషనల్ పెయిన్ ఫుల్‌గా ఉన్నాను. మా నాన్న చేసిన తప్పు మమ్మల్ని విపరీతంగా ప్రేమించటం. మీడియా వారు.. మీకు కుటుంబాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇష్యూస్ ఉంటాయి. కానీ కొందరు మా విషయంలో లిమిట్స్ క్రాస్ చేశారు. మా అమ్మ బాధలో ఉంది. నాన్నకు దెబ్బలు జరిగాయి.
Manchu Vishnu Press Meet
నేను లాస్ ఎంజెల్స్‌లో ‘కన్నప్ప’ వర్క్‌లో ఉండగా ఈ గొడవ గురించి తెలిసి.. అన్నీ వదిలి వచ్చేశాను. మీడియా పర్సన్‌కు గాయాలు తగలటం బాధాకరం. అయితే అది ఇంటెన్షనల్‌గా చేసింది కాదు. మీడియా వారికి నమస్కరిస్తూ వచ్చారు. ముఖం మీద ఏదో పెట్టారని.. అలా జరిగిపోయింది. అతని ఫ్యామిలీతో టచ్‌లో ఉన్నాము. పోలీసులు మా కంటే ముందు మీడియాకు నోటీసులు లీక్ చేస్తున్నారు. నాకు నోటీసులు ఈ రోజు 9:30కి జారీ చేశారు. దీనిపై నేను పోలీసులతో మాట్లాడతాను. మాకు ఏం ప్రొటెక్షన్ ఇచ్చారు. నాకు కలవాల్సిన అవసరం లేదు.. కానీ వారిపై గౌరవించి కలుస్తాను.
ప్రేమతో గెలవాల్సిన విషయాలపై రచ్చ పెట్టుకుంటే ఏది జరగదు. మనోజ్(Manoj) ఆరోపణలపై నేను చెప్పేది ఏమి లేదు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుద్ది. నేను నా కుటుంబ విషయాలు మాట్లాడను. నేను ఇక్కడ ఉంటే.. ఫిర్యాదుల వరకు వెళ్లేది కాదు. తమ్ముడు పెళ్లి శుభకార్యం.. బిడ్డను కన్నారు. దాని గురించి ఎవరు ఫీలవరు. నాన్న గారి ఆస్తి ఆయన ఇష్టం. ఎంతో కష్టపడి స్వయం కృషితో గొప్ప స్థాయికి ఎదిగారు. మాకిచ్చే, లభించే గౌరవం ఆయన వల్లే.. మోహన్ బాబు పిల్లలుగానే. కుటుంబం పరంగా నాన్నగారు ఏది అనుకుంటే అదే ఉండాలి. తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయాలి. మీడియాలో కొంతమంది హద్దు మీరుతున్నారు.. అందరూ కాదు. పబ్లిక్ ఫిగర్స్ పై రిపోర్ట్ చేయటం మీడియా బాధ్యత. కానీ సోసైటీలో కొందరు ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. వినయ్ గారు నాకు అన్న లాంటి వారు.. ఆయన ఎవరిపైనా చేయి చేసుకోలేదు. వినయ్‌కు నాకు 15 ఏళ్ల పరిచయం ఉంది. ఇండియాలోనే గొప్ప స్దాయి ఉన్న వ్యక్తి.
Also Read : Hero Ajith : అభిమానులు అలా పిలవడం ఇబ్బందిగా ఉందంటున్న హీరో అజిత్