Manchu Vishnu: గోల్డెన్‌ వీసా అందుకున్న మంచు విష్ణు !

గోల్డెన్‌ వీసా అందుకున్న మంచు విష్ణు !

Hello Telugu - Manchu Vishnu

Manchu Vishnu: టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) నుండి గోల్డెన్‌ వీసా అందకున్నారు. కళలు, క్రియేటివిటీ పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్‌, విద్య, వారసత్వ సంపద చరిత్ర గురించి అధ్యయనం చేసేవాళ్లు, సేవలు అందిస్తున్న వాళ్లకు యూఏఈ (దుబాయ్‌) ప్రభుత్వం గోల్డెన్ వీసాను జారీ చేస్తుంది. దీని ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలికంగా ఎలాంటి పరిమితులు లేకుడా స్వేచ్ఛగా నివాసం ఉండేందుకు వీలు కలుగుతుంది.

Manchu Vishnu Got..

ఇటీవలే మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అర్జున్‌ యూఏఈ గోల్డెన్‌ విసా అందుకున్నారు. తాజాగా దీన్ని అందుకున్న సినీ ప్రముఖుల జాబితాలో మంచు విష్ణు(Manchu Vishnu) చేరారు. 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. ఇప్పటికే చిత్ర పరిశ్రమకు చెందిన రజనీకాంత్, షారుక్‌ ఖాన్‌, దుల్కర్‌ సల్మాన్‌, త్రిష, అమలాపాల్, మోహన్‌లాల్‌, సునీల్‌ దత్‌, సంజయ్‌ దత్‌,మోనీ రాయ్‌,బోనీ కపూర్‌, మమ్ముట్టి, టొవినో థామస్‌ వంటి స్టార్స్‌కు ఈ వీసా లభించింది.

2019 నుంచి ఈ గోల్డెన్‌ వీసాలు యూఏఈ ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇందులో భాగంగా విదేశీయులకు నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనానికి ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. ఇక యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసాకు 10, 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. తర్వాత దానికదే రెన్యూవల్‌ అవుతుంది. ప్రస్తుతం మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Also Read : Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ పై దిల్‌ రాజు కీలక ప్రకటన !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com