Manchu Manoj : హైదరాబాద్ – నటుడు మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను కావాలని బద్నాం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నోటీసులు జారీ చేయడంపై స్పందించారు. ఎవరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయనేది ఇంకా తేలాల్సి ఉందన్నారు. తాను ఏనాడూ ఆస్తుల గురించి గొడవ పడిన దాఖలాలు లేవన్నారు. తన తండ్రిని అడ్డం పెట్టుకున్న తన సోదరుడు మంచు విష్ణు నాటకాలు ఆడుతున్నాడంటూ ఆరోపించారు.
Manchu Manoj Shocking Comments..
నోటీసులు జారీ చేయడంపై రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ ప్రతీమా సింగ్ ను కలిశారు. తనకు సంబంధించిన వివరాలు, ఆధారాలను సమర్పించారు. ఏమీ తెలుసుకోకుండా ఎలా నోటీసులు జారీ చేస్తారంటూ ప్రశ్నించారు. తాను ఆస్తులు కోరుకోలేదని, విద్యార్థుల భవిష్యత్తు నాశనమై పోతోందని ఆవేదన చెందారు.
వారికి న్యాయం చేయాలని కోరుతూ తాను రంగంలోకి దిగానని ఏనాడూ దౌర్జన్యానికి పాల్పడిన దాఖలాలు లేవన్నారు మంచు మనోజ్. తెర వెనుక ఎవరు ఉండి ఆడిస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు. మోహన్ బాబు సినిమాలోనే విలన్ కాదు నిజ జీవితంలో కూడా రియల్ విలన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తనయుడు.
Also Read : Hero Shahid Kapoor Movie : ‘దేవా’ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్