Manchu Manoj: కవల పిల్లలపై క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్ !

కవల పిల్లలపై క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్ !

Hello Telugu - Manchu Manoj

Manchu Manoj: మంచు మనోజ్ భార్య మౌనికా రెడ్డి ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా మంచు మనోజ్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే తన అన్న మంచు విష్ణుకు కవలలు పుట్టినట్లే… మంచు మనోజ్‌(Manchu Manoj) కు కూడా కవలలు పుట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. దీనితో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై… మంచు మనోజ్ స్పందించారు. ఆ వార్తలో నిజంగా లేదంటూ కండీస్తూనే… మా జీవితాల్లోకి రానున్న బిడ్డల పట్ల ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నామని తెలిపి అందరినీ కన్ఫ్యూజ్ చేశారు. ఆ వార్తలను నమ్మవద్దు అంటూ ప్రత్యేకంగా ఓ లేఖను ఆయన విడుదల చేశారు. ప్రస్తుతం మనోజ్ విడుదల చేసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Manchu Manoj – సోషల్ మీడియా వేదికగా మనోజ్ విడుదల చేసిన లేఖలో ఏముందంటే..

అభిమానులకు, శ్రేయోభిలాషులకు నమస్కారం..

అనుక్షణం మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటువంటి ఒక గొప్ప కుటుంబం మాకు అండగా ఉన్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం.

శుభవార్త: నా సతీమణి ప్రస్తుతం ఏడవ నెల గర్భవతి. భగవంతుని ఆశీస్సులతో ఈ క్షణం వరకు తను ఆరోగ్యంగా సురక్షితంగా ఉంది. ఇంకొన్ని రోజుల్లో మా జీవితాల్లోకి రానున్న బిడ్డల పట్ల ఎంతో ఆశగా ఆసక్తితో ఎదురుచూస్తున్నాం. ఒక విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాను: కవల పిల్లలు విషయంలో బయట వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదు. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు మేము నేరుగా మా ఆనందాన్ని మీతో పంచుకుంటాము. దయచేసి మా ప్రమేయం లేకుండా బయట వస్తున్న వార్తలను పట్టించుకోవద్దు. ఎల్లప్పుడూ.. మీరు మాపై చూపించే ఆదరాభిమానాలే మాకు శ్రీరామరక్ష..

కృతజ్ఞతలతో
-మంచు మనోజ్

Also Read : Thalapathy Vijay: ‘సౌత్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ కోటి రూపాయలు విరాళం ఇచ్చిన విజయ్‌ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com