ఈ మధ్యన స్వలింగ సంపర్కం అనేది ఓ ఫ్యాషన్ అయి పోయింది. ఇందుకు సంబంధించిన సినిమాలు బోలెడు వస్తున్నాయి. ఒకప్పుడు నాలుగు గోడల వరకే పరిమితమై ఉండేది. కానీ సీన్ మారింది. సీన్స్ కూడా మారి పోయాయి. పేరు పొందిన నటీమణులు డోంట్ కేర్ అంటున్నారు.
ఏదో రకంగా నేషనల్ వైడ్ గా వైరల్ గా మారితే చాలని అనుకుంటున్నారు. బోలెడ్ ప్రచారం ఆపై కావాల్సినంత అవకాశాలు తలుపు తడతాయని అనుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టే కథ బాగుంటే ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదంటున్నారు నిర్మాతలు.
తాజాగా మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి హాట్ టాపిక్ గా మారారు. దీనికి కారణం ఆమె మలయాళం సినిమాలో లిప్ కిస్ లో రెచ్చి పోవడమే. ఎవరో హీరో అనుకుంటే పొరపాటు పడినట్లే. తెలుగులో బాలయ్య బాబుతో కీ రోల్ పోషించిన నటి హానీ రోజ్ తో రెచ్చి పోయి నటించింది. ఇద్దరూ బెడ్ రూమ్ సీన్స్ దాకా వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు , యూట్యూబ్ లో సీన్స్ రచ్చ రచ్చ చేస్తున్నాయి.
ఈ మలయాళ మూవీలో మోహన్ లాల్ కూడా నటించడం విశేషం. మాన్స్టర్ చిత్రంలో చివరి అర గంటలో మంచు లక్ష్మి, హానీ రోజ్ దుమ్ము రేపారు. సెకండాఫ్ లో ఇద్దరూ లెస్బియన్స్ గా మారడం ఒకింత విస్తు పోయేలా చేసింది.