మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి నటించిన ఆది పర్వం చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. మూవీ మేకర్స్ తను పుట్టిన రోజు కావడంతో రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరినీ భయ పెట్టేలా ఉంది ఈ పోస్టర్.
ఇంగ్లీష్ యాక్సెంట్ తో పాటు తెలుగులో మాట్లాడుతూ ఆకట్టుకుంటున్న మంచు లక్ష్మి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారారు. తను స్వంతంగా వ్యాపారాలు చేస్తోంది. ఇదే సమయంలో సేవా కార్యక్రమాలు చేపడుతూ నిత్యం వార్తల్లో ఉంటోంది. అంతే కాదు పలువురిని ఇంటర్వ్యూ చేస్తూ తనను తాను ప్రూవ్ చేసుకునే పనిలో ఉంది మంచు లక్ష్మి.
గతంలో కొన్ని సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తాను నటించిన అగ్ని నక్షత్రం పూర్తి కావచ్చింది. తాజాగా మరో కొత్త సినిమా ఆది పర్వంలో ప్రత్యేకమైన పాత్రలో నటిస్తోంది మంచు లక్ష్మి. ఈ ఫస్ట్ లుక్ చూసిన వారంతా అమ్మోరు లాగా ఉందంని పేర్కొంటున్నారు.
ఆది పర్వం మూవీలో ఎస్తేర్, సుహాసిని, ఆదిత్య ఓం , తదితర నటీనటులు ఇతర పాత్రల్లో నటిస్తుండడం విశేషం. కాగా ఇంకా ఈ చిత్రానికి సంబంధించి వివరాలు పూర్తిగా వెల్లడించ లేదు మూవీ మేకర్స్.