Derick Abraham : రెండు రోజుల క్రితం ఓటీటీకి వచ్చిన మలయాళ డబ్బింగ్ చిత్రం డెరిక్ అబ్రహం(Derick Abraham) సినీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో మమ్ముట్టి హీరోగా నటించగా అన్సప్ పాల్, కనిక, తరుషి ప్రధాన పాత్రల్లో నటించారు. షాజీ పాడూర్ దర్శకత్వం వహించారు. 2018లో మలయాళంలో రిలీజైన ఈ సినిమా అప్పట్లో రూ.40కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెలుగులోకి అనువాదమై డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. కథ విషయానిక వస్తే.. కేరళలోని ఓ ప్రాంతంలో సీరియల్ కిల్లింగ్స్ జరుగుతుంటాయి ఈ కేసును అప్పటి వరకు ఉన్న పోలీసులు కనిపెట్టలేక పోవడంతో డెరిక్ అబ్రహం రంగంలోకి దిగి నిందితుడిని పట్టుకుంటాడు. తర్వాత కొన్నాళ్లకు డెరిక్ అబ్రహం తమ్ముడు ఫిలిప్ అబ్రహం తన ప్రియురాలి హత్యకేసులో జైలు పాలవుతాడు. అయితే అన్న డెరిక్ అబ్రహం కావాలనే తనను జైలు నుంచి బయటకు తీసుకు రావట్లేదని తమ్ముడు ఫిలిప్ అన్నపై కోపం పెంచుకుంటాడు.
Derick Abraham OTT Updates
అదే సమయంలో డెరిక్ అంటే పడని ఓ ఇద్దరు పోలీసుల సాయంతో ఫిలిప్ జైలు నుంచి తప్పించుకుంటాడు. ఈ క్రమంలో ఫిలిఫ్ తన అన్నను చంపాడా, అసలు తన ప్రియురాలిని తనే చంపాడా, తన తమ్ముడిని రక్షించుకునేందుకు అన్న ఏం చేశాడనే ఆసక్తికరమైన పాయింట్‌తో సినిమా ముగుస్తుంది. కాగా ఈ సినిమాకు ప్రారంభం, క్లైమాక్సులే ప్రధాన బలం. కా సేపు రోటిన్ స్టోరీ అనిపించినా వచ్చే ట్విస్టులు కాస్త థ్రిల్‌కు గురి చేస్తాయి. ఇప్పుడీ సినిమా ఆహా ఓటీటీ యాప్‌లో అందుబాటులో ఉంది. ఫ్యామిలీతో కలిసి ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.
Also Read : Mahesh Babu : ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా కోసం విన్న చూస్తా అంటూ వ్యాఖ్యానించిన మహేష్