Mammootty: ఖైదీగా మారిన స్టార్ హీరో !

ఖైదీగా మారిన స్టార్ హీరో !

Hello Telugu - Mammootty

Mammootty: విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటనతో ఛాలెంజింగ్ ప్రాజెక్టులను ఎంచుకుంటారు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. ఏడుపదుల వయసులో కూడా వరుస ప్రయోగాత్మక సినిమాల్లో నటిస్తూ… అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. ఇటీవల జ్యోతికతో కలిసి ‘కాథల్-ది కోర్‌’, భూతకాలం’ ఫేమ్ రాహుల్‌ సదాశివన్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘భ్రమయుగం’ సినిమాల్లో నటనతో సినీప్రియులను ఎంతగానో మెప్పించారు. బ్లాక్ అండ్ వైట్‌ లో మూడే పాత్రలతో తీసిన ‘భ్రమయుగం’ సినిమాలో మాంత్రికుడి పాత్రతో… తన సత్తా ఎంటో నిరూపించాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా సాధ్యమేనా..? అనుకుంటే సాధ్యమే అని భ్రమయుగంతో నిరూపించాడు. ఒక స్టార్ హీరో ఒక గే పాత్ర చేయడం అంటే అంత సులభం కాదు. అలాంటిది ‘కాథల్-ది కోర్‌’ లో జ్యోతిక సరసన గే గా నటించి… అందరి హీరోల మాదిరి కాకుండా కొత్తదనాన్ని, ప్రయోగాన్ని, వైవిధ్యాన్ని చూపుతు తనదైన స్టైల్లో సినిమాలు తీస్తున్నారు.

Mammootty Movie Updates

‘కాథల్-ది కోర్‌’, ‘భ్రమయుగం’ సినిమాలతో అలరించిన మమ్ముట్టి… ఇప్పుడు భిన్నమైన కథలతో మరో రెండు క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వైశాఖ్ దర్శకత్వంలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో ‘టర్బో’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిస చిత్ర యూనిట్… ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్ పనుల్లో బిజీగా ఉంది. దీనితో తాజాగా ఈ సినిమాకు సంబందించి మరో కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty). ఈ పోస్టర్ లో పోలీసుస్టేషన్‌ లో ఖైదీల మధ్యలో కూర్చుని కొత్త అవతారంలో కనిపిస్తూ… అభిమానులను ఆకట్టుకుంటున్నారాయన. సాధారణ ప్రేక్షకుడు గుర్తు పట్టలేనంతగా… ఖైదీ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రూపొందుతున్న ఈ సినిమాలో సునీల్‌, రాజ్‌ బి శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారుతోంది.

ఇదే క్రమంలో ఆయన ‘బజూక’ అనే మరో విభిన్న చిత్రంలో నటిస్తున్నారు. గేమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డీనో డెన్నిస్‌ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమాలో… బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని గడ్డంతో స్టైలిష్ లుక్‌ లో కనిపిస్తున్నారు మమ్ముట్టి(Mammootty). ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ్‌ మీనన్‌, సుమిత్‌ నావల్‌, సిద్దార్ధ్‌ భరతన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను థియేటర్‌ ఆఫ్ డ్రీమ్స్‌ అండ్‌ సరిగమ బ్యానర్లపై డోల్విన్‌ కురియాకోస్ జిన్‌ వీ అబ్రహాం, విక్రం మెహ్రా, సిద్దార్థ్‌ ఆనంద్ కుమార్‌ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read : Saripodhaa Sanivaaram: అదరగొడుతున్న నాని ‘సరిపోదా శనివారం’ ఫస్ట్ గ్లింప్స్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com