Mammootty: మలయాళం అగ్ర నటుడు మమ్ముట్టి, జ్యోతిక ప్రధాన పాత్రల్లో జో బేబీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఎమోషనల్ డ్రామా ‘కాదల్ – ది కోర్’. నవంబరు 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఏకంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీనితో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా ? అని ఎదురు చూస్తున్న అభిమానులకు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ శుభవార్త చెప్పింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు ఉంచినట్లు ప్రకటించింది. కాకపోతే ఈ సినిమాను ప్రస్తుతం ఓవర్సీస్ యూజర్లు మాత్రమే వీక్షించే అవకాశం కల్పిస్తూ చిన్న మెలిక పెట్టింది. అది కూడా రెంటల్ బేసిస్ లో 2.99 డాలర్లు చెల్లించి ఈ సినిమాను వీక్షించాల్సి ఉంటుంది.
Mammootty Movie on OTT
మరోవైపు మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమాను స్ట్రీమింగ్‌కు తీసుకురావడంతో ఓటీటీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, భారత్ లో ఉన్న ప్రైమ్ చందాదారులకు ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తామనే దానిపై అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి ఇంకా ఎలాంటి ప్రకటనా లేదు. వీలైనంత త్వరగా స్ట్రీమింగ్‌కు తెచ్చే అవకాశం ఉందని టాక్. అయితే అది ఓవర్సీస్ మాదిరీగా అద్దె రూపంలో తీసుకొస్తారా ? లేదా ? అన్నది తెలియాల్సి ఉంది. ‘కాదల్ – ది కోర్’ను విడుదలకు ముందే వివాదాలు చుట్టుముట్టాయి. హోమో-సెక్సువాలిటీని ప్రోత్సహించేలా సినిమా ఉందంటూ కువైట్, ఖతార్ దేశాలు ఈ చిత్రంపై నిషేధం విధించాయి. అయితే వాటన్నింటినీ అధిగమించి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.
‘కాథల్-ది కోర్’ సినిమా కథ ఏమిటంటే ?
‘కాథల్-ది కోర్’ సినిమాకు సంబందిచిన కథా నేపథ్యం చూస్తే… పంచాయితీ ఎన్నికల్లో పోటీచేయాలనుకునే ఓ ప్రభుత్వ ఉద్యోగి మాథ్యూ దేవస్సే (మమ్ముట్టి- Mammootty)… తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేస్తాడు. అయితే అతను నామినేషన్ వేసిన రెండు రోజులకే తన భార్య ఓమన(జ్యోతిక) అతడి నుంచి విడాకుల కోసం కోర్టును ఆశ్రయిస్తుంది. దీనికి జార్జ్ కు అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడితో స్వలింగ సంపర్క బంధం ఉందనే ఆరోపణలతో కోర్టును విడాకులు ఇవ్వమని కోరుతుంది. దీంతో అతడి పోటీపై సందిగ్ధత నెలకొంటుంది. అయితే, జార్జ్ మాత్రం ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది..? జార్జ్ ఎన్నికల్లో పోటీ చేశాడా? వీరికి విడాకులు వచ్చాయా? అనేది మిగతా కథ. స్వలింగ సంపర్కుల పట్ల సమాజం ప్రవర్తించే తీరును దర్శకుడు జీయో బేబి ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించినట్లు తెలుస్తోంది.
Also Read : Hero Jr NTR: చరణ్ కుమార్తె క్లీంకారకు ఎన్టీఆర్ స్పెషల్ గిఫ్ట్ ?