Mammootty: జూన్‌ 13న మమ్ముట్టి ‘టర్బో’ !

జూన్‌ 13న మమ్ముట్టి ‘టర్బో’ !

Hello Telugu - Mammootty

Mammootty: విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటనతో ఛాలెంజింగ్ ప్రాజెక్టులను ఎంచుకోవడంలో ముందుండే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి… ‘భ్రమయుగం’ సినిమాతో ఈ ఏడాదిని విజయవంతంగా మొదలుపెట్టారు. ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్‌ సదాశివన్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘భ్రమయుగం’ సినిమాల్లో నటనతో సినీప్రియులను ఎంతగానో మెప్పించారు. బ్లాక్ అండ్ వైట్‌ లో మూడే పాత్రలతో తీసిన ‘భ్రమయుగం’ సినిమాలో మాంత్రికుడి పాత్రతో… తన సత్తా ఎంటో నిరూపించాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా సాధ్యమేనా..? అనుకుంటే సాధ్యమే అని భ్రమయుగంతో నిరూపించాడు.

Mammootty Movie Updates

కథ మాత్రమే కాదు… పాత్ర ఏదైనా ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా ఈసారి ‘టర్బో’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నారు. వైశాక్‌ దర్శకత్వంలో మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా ఈ ‘టర్బో’ ను నిర్మిస్తున్నారు. మమ్ముట్టి(Mammootty) సొంత నిర్మాణ సంస్థ మమ్ముట్టి కంపెనీ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాలో.. టర్బో జోస్‌ పాత్రలో మమ్ముట్టి కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

దీనితో ఈ సినిమా విడుదల తేదీన ఖరారు చేసారు చిత్ర యూనిట్. ఈ సినిమాను జూన్‌ 13న విడుదల కానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు అందుకు సంబంధించిన పోస్టర్‌ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్టర్‌లో వాహనంపై కూర్చొని, రాయల్‌ లుక్‌లో కనిపిస్తున్న మమ్ముట్టి చిత్రంపై ఆసక్తిని పెంచుతున్నారు. తెలుగు నటుడు సునీల్‌, అంజనా జయప్రకాశ్‌, రాజ్‌ బి శెట్టి ఈ సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read : Teja Sajja: సూపర్ యోధాగా తేజ సజ్జా లుక్ అదుర్స్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com