Malaysia PM Praise : తమిళ సినీ ఇండస్ట్రీలో రియల్ స్టార్ గా పేరు పొందారు సూపర్ స్టార్ రజనీకాంత్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తను నటించిన జైలర్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆగస్టు 10న విడుదలైన ఈ చిత్రం రూ. 600 కోట్లు కొల్లగొట్టింది. ఆయనతో పాటు తమన్నా భాటియా, శివ రాజ్ కుమార్ , మోహన్ లాల్ , రమ్య కృష్ణన్ , కమెడియన్ యోగి బాబు నటించారు.
Malaysia PM Praise to Thalaivaa
సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ చీఫ్, డీఎంకే ఎంపీ కళానిధి మారన్ రూ. 100 కోట్లు చెక్కుతో పాటు కోటిన్నర విలువ చేసే బీఎండబ్ల్యూ కారు కూడా బహూకరించారు. ఇందులో నటించిన , సహకరించిన ప్రతి ఒక్కరికీ భారీ గిఫ్టులు కూడా ఇచ్చారు.
ఇక డైరెక్టర్ కు కారుతో పాటు బ్లాంక్ చెక్కు ఇచ్చాడు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి రజనీకాంత్ కు. తాజాగా ఏకంగా మలేషియా ప్రధాన మంత్రి(Malaysia PM) జి20 సదస్సు సందర్భంగా ఇండియాకు వచ్చారు. దీనిని పురస్కరించుకుని రజనీకాంత్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. భారతీయ సినిమా చరిత్రలో మోస్ట్ పాలపుర్ హీరోగా గుర్తింపు పొందారని ఆయనను కలవడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు ప్రధానమంత్రి. ప్రజల కష్టాల విషయంలో నా పోరాటానికి రజనీకాంత్ ఇచ్చిన గౌరవాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Also Read : AR Rahman Concert : రెహమాన్ సంగీత కచేరిలో అపశ్రుతి