Bougainvillea : మలయాళంలో ఇటీవల విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకున్న చిత్రం ‘బోగన్ విల్లియా’. జ్యోతిర్మయి, ఫహద్ ఫాజిల్ , కుంచకో బోబన్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ అక్టోబరు 17న మలయాళంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రుతింతే లోకం నవల ఆధారంగా దర్శకుడు అమల్ నీరద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రాబోతోంది. డిసెంబరు 13న సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
Bougainvillea Movie Updates
కథ:
రాయిస్(కుంచకో బోబన్), రీతూ (జ్యోతిర్మయి) భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన రీతూ గతం మర్చిపోతుంది. తమ జీవితాలను గాడిలో పెట్టుకునే ప్రయత్నంలో ఉండగా, రీతూ చిక్కుల్లో పడుతుంది. కేరళ వచ్చిన కొందరు పర్యటకులు కనిపించకుండా పోతుంటారు. ఆ కేసును ఏసీపీ డేవిడ్ (ఫహద్ ఫాజిల్) విచారణ చేస్తుంటాడు. టూరిస్టుల మిస్సింగ్‌కు రీతూనే కారణం అన్నట్లు డేవిడ్‌కు కొన్ని ఆధారాలు దొరుకుతాయి. ఆ మిస్సింగ్స్‌లతో రీతూకి ఉన్న సంబంధం ఏంటి? ఏసీసీ డేవిడ్ ఆ మిస్సింగ్ కేసులు ఎలా ఛేదించాడు? అన్నది చిత్ర కథ.
Also Read : Matka OTT : 20 రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైన వరుణ్ తేజ్ ‘మట్కా’