Malavika : డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్(Prabhas) కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే సినిమా పూర్త్యయ్యే దశలో ఉంది. దీంతో ప్రభాస్ కొత్త సినిమాలపై ప్లాన్ చేశాడు. ఇప్పటికే వంగా సందీప్ రెడ్డికి టైం ఇచ్చాడు. ఇది ఉగాది పర్వదినం సందర్బంగా షూటింగ్ మొదలు కావచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు డైరెక్టర్. మరో వైపు ఫౌజీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్.
Malavika Mohanan Comment
ఇంకో వైపు ది రాజా సాబ్ ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. టేకింగ్, మేకింగ్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న దర్శకుడు మారుతి. తన ప్రజెంటేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు ది రాజా సాబ్ మూవీలో. ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. ఈ సినిమాలో కీలకమైన పాత్ర పోషించింది ప్రముఖ నటి మాళవిక మోహన్(Malavika). చిట్ చాట్ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది డార్లింగ్ ప్రభాస్.
ఇప్పటి వరకు తాను చూసిన, నటించిన హీరోలలో డార్లింగ్ ప్రభాస్ వెరీ వెరీ స్పెషల్ అంటూ కితాబు ఇచ్చింది. తను ఇంటి నుంచి తయారు చేసి తీసుకు రావడం, అందరికీ వడ్డించడం, ప్రత్యేకించి ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని కోరుకోవడం అద్భుతమని పేర్కొంది ఈ ముద్దుగుమ్మ. మొత్తంగా డార్లింగ్ ప్రభాస్ తో నటిస్తానని అనుకోలేదని, కానీ అనుకోకుండా మారుతి ద్వారా ఛాన్స్ దక్కిందని చెప్పింది మాళవిక మోహన్. సినిమా చూశాక మా ఇద్దరి పెయిర్ సూపర్ గా ఉంటుందని ప్రతి ఒక్కరు చెప్పడం ఖాయమన్నారు. ఎంతో ఎత్తుకు ఎదిగినా చాలా వినయంగా ఉంటాడని కితాబు ఇచ్చింది ప్రభాస్ గురించి.
ఇక ది రాజా సాబ్ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇందులో సంజయ్ దత్, అనుపమ్ ఖేర్, వరలక్ష్మి శరత్ కుమార్, యోగిబాబు, జిష్ణు సేన్ గుప్తా ఇందులో నటిస్తున్నారు.
Also Read : Hero Ram Charan-Janhvi :రామ్ చరణ్..జాన్వీ కపూర్ మూవీ డేట్ కన్ ఫర్మ్