Malai Movie Yogi Babu : యోగి బాబు గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఒకప్పుడు వడివేలు ఉండే వాడు. కానీ రాను రాను తనకు ఆశించిన మేర , తను కోరుకున్నట్టు పాత్రలు రావడం లేదు. టాలీవుడ్ లో బ్రహ్మానందం ఎలాగో వడివేలు అలా. కానీ ఎప్పుడైతే యోగి బాబు ఎంటర్ అయ్యాడో సీన్ మారింది. ఇప్పుడు తన చేతిలో ఊహించని రీతిలో సినిమాలు ఉన్నాయి. కొందరు నటులు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే రకం.
Malai Movie Yogi Babu Role
కానీ వీటికి భిన్నంగా ఉంటాడు యోగి బాబు. పోనీ మరీ అంత ఆకట్టుకునే రూపం కాదు. కానీ అతడిలో ఏదో తెలియని అమాయకత్వం ఉంటుంది. అదే అతడిని పర్ ఫెక్ట్ కమెడియన్ గా మారేలా చేసింది. ప్రత్యేకించి తమిళ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పవర్ ఫుల్ యాక్టర్ దళపతి విజయ్.
తను చేసే ప్రతి సినిమా లోనూ యోగి బాబుకు(Yogi Babu) ఛాన్స్ ఇచ్చేలా చూస్తున్నాడు. ఎందుకో ఇద్దరి కాంబినేషన్ మరింత ఆకట్టుకునేలా ఉండడంతో దర్శక, నిర్మాతలు కూడా ఓకే చెప్పేస్తున్నారు. తాజాగా యోగి బాబు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు.
డిమాండ్ ఉంది కదా అని ఏది పడితే అది చేయడం లేదు. తనకు నచ్చితేనే, అది ఎంతో కొంత ఎఫెక్ట్ చూపుతుందని అనుకుంటేనే ఓకే చెబుతున్నాడు యోగి బాబు. తాజాగా తాను నటించిన మలై మూవీ వైరల్ గా మారింది. సినిమా సక్సెస్ అనేది తమతో ముడిపడి ఉండదంటాడు యోగి బాబు. ఆ క్రెడిట్ అంతా దర్శకుడికే చెల్లుతుందని చెబుతాడు వినమ్రంగా.
Also Read : Vyiham Movie : ‘వ్యూహం’ ఆర్జీవీ సంచలనం