Lucky Bhaskar : ‘లక్కీ భాస్కర్’ సినిమా రిలీజ్ ను మరోసారి పొడిగించిన మేకర్స్

విడుదల వాయిదా విషయమై మేకర్స్ స్పందిస్తూ....

Hello Telugu - Lucky Bhaskar

Lucky Bhaskar : మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న ‘లక్కీ భాస్కర్(Lucky Bhaskar)’ మూవీ మరోసారి వాయిదా పడింది. ఇంతకు ముందు ఓసారి ఈ సినిమాను వాయిదా వేస్తూ సెప్టెంబర్ 7వ తేదీన విడుదల అని ప్రకటించిన మేకర్స్.. ఇప్పుడు మరోసారి ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా తెలుపుతూ, అందుకు గల కారణాలను తెలియజేశారు. దుల్కర్ సల్మాన్ తెలుగులోనూ ‘మహానటి, సీతారామం’ వంటి ఘన విజయాలను సొంతం చేసుకుని.. తెలుగు ప్రేక్షకులకు సైతం బాగా దగ్గరయ్యారు. ఇప్పుడాయన చేస్తున్న సినిమా ‘లక్కీ భాస్కర్’పై భారీ స్థాయిలో అంచనాలున్నాయి. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.

Lucky Bhaskar Movie Updates

విడుదల వాయిదా విషయమై మేకర్స్ స్పందిస్తూ.. ‘లక్కీ భాస్కర్(Lucky Bhaskar)’ కోసం ఇంతలా ఎదురు చూస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేయడానికి అదనపు సమయం పడుతున్న కారణంగా సినిమాను అక్టోబర్ 31 తేదీకి వాయిదా వేస్తున్నాము. వెండితెరపై ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించడం కోసం, డబ్బింగ్ సహ అన్ని సాంకేతిక విభాగాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రస్తుతం వర్క్ జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని, ప్రతి భాషలో మాతృ భాష అనుభూతిని అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నాము. చిత్ర విడుదలను వాయిదా వేయడం కష్టమైనప్పటికీ, ఈ నిర్ణయం సినిమాకు మేలు చేస్తుందని భావిస్తున్నాము అని నిర్మాతలు వెల్లడించారు.

దుల్కర్ సల్మాన్ అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రేమికులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘శ్రీమతి గారు’ సాంగ్, టైటిల్ ట్రాక్, టీజర్‌ మంచి స్పందన రాబట్టుకుని సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఇప్పుడు దీపావళి పండుగ కానుకగా విడుదల చేయాలని నిర్ణయించారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రం అక్టోబర్ 31న థియేటర్లలోకి వస్తుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. కళా దర్శకుడు బంగ్లాన్ ఈ చిత్రం కోసం 80ల నాటి ముంబైని పునర్నిర్మించారని.. ఈ చిత్రంలో ఆయన అద్భుత పనికి అవార్డులు అందుతాయని నిర్మాతలు నమ్మకంగా చెబుతున్నారు. దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read : Bhale Unnade: రాజ్ తరుణ్ ‘భలే ఉన్నాడే’ ట్రైలర్ రిలీజ్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com