Shah Rukh Khan : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ దర్శకుడు మహేష్ మంజ్రేకర్. చిట్ చాట్ సందర్బంగా స్పందిస్తూ తన కోసం గత కొంత కాలం నుంచి స్క్రిప్ట్ తయారు చేసే పనిలో ఉన్నానని అన్నాడు. ఎలాంటి పాత్రకైనా సరిపోయే యాక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే తన బెస్ట్ ఛాయిస్ షారుక్ ఖాన్(Shah Rukh Khan) అని స్పష్టం చేశాడు.
Shah Rukh Khan Movie Updates
తను తీయబోయే అసాధారణ చిత్రంలో ఏ పాత్ర పోషించాలని కోరుకుంటున్నాడో దానిని తాను రెడీ చేశానని చెప్పాడు. తన పట్ల ఉన్న ప్రేమను, అభిమానాన్ని మరోసారి వెల్లడించాడు. ఒక నటుడిగా చాలా తక్కువగా అంచనా వేసే ఒక నటుడు ఉన్నాడు. కానీ అతను అందరి హీరోలకంటే గొప్ప నటుడు. తనే షారుక్ ఖాన్. ఎలాంటి భేషజాలు లేకుండా ఉండడంలో తనకు తనే సాటి అని ప్రశంసలు కురిపించాడు దర్శకుడు మహేష్ మంజ్రేకర్.
నిజ జీవితంలో ఎలా ఉంటాడో కెమెరా ముందు కూడా అలాగే ఉంటాడు. అందుకే తన ఫస్ట్ ప్రయారిటీ షారుక్ ఖాన్ మాత్రమేనని పేర్కొన్నాడు. అయితే కింగ్ ఖాన్ కోసం పెయిడ్ హంతకుడు పాత్ర సిద్దంగా ఉందన్నాడు.
ఇదిలా ఉండగా అట్లీ దర్శకత్వంలో నటించాడు షారుక్ ఖాన్. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో నయనతార కూడా మెప్పించింది. ఆ తర్వాత రాజ్ కుమార్ హిరానీతో కలిసి డంకీలో చివరిసారిగా దర్శనం ఇచ్చాడు. ప్రస్తుతం కొత్త మూవీ కోసం చర్చలు జరుగుతున్నాయని టాక్.
Also Read : Posani Krishna Murali Shocking :నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్