Mahesh-Charan : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. దాదాపు అన్ని చోట్లా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ దంపతులు మంగళగిరిలో, బాలకృష్ణ దంపతులు హిందూపురంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు హీరో కిరణ్ అబ్బవరం రాయచోటి, దర్శకులు గోపీచంద్, బుచ్చిబాబు, వైవిఎస్ చౌదరి, గెటప్ శీను వంటి ప్రముఖులు తమ గ్రామాల్లో తమ ఓటును వినియోగించుకున్నారు.
Mahesh-Charan Voted..
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉదయం నుంచి సినీ తారలు ఓటు వేసేందుకు బారులు తీరారు. జూనియర్ ఎన్టీఆర్ మొదలుకొని అల్లు అర్జున్, రామ్, నితిన్, నాని, చిరంజీవి, వెంకటేష్, నాగ చైతన్య, నాగార్జున తదితరులు ప్రపంచ వ్యాప్తంగా వచ్చి క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లోని పోలింగ్ బూత్‌లలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత, స్టార్ గ్టోబల్ రామ్‌చరణ్ మరియు ఉపాసన ఓటు వేశారు.
Also Read : Appu Kutty : తమిళ కమెడియన్ చదువుకున్న స్కూల్ కి అన్ని లక్షల విరాళమిచ్చాడా..!