Mahesh Babu : ధనుష్ హీరోగా సందీప్ కిషన్, విజయ్ కాళిదాసు, దుషారా విజయన్, ఆపర్ణ బాలమురళి ప్రధాన పాత్రదారులుగా నటించిగా ఇటీవల థియేటర్లలో విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న చిత్రం ‘రాయన్’. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతున్న ఈ చిత్రాన్ని కథానాయకుడు ధనుష్ స్వయంగా రచన చేసి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల నుంచే కాకుండా తెలుగు, తమిళ సినీ సెలబ్రిటీల నుంచి కూడా ఊహించని విధంగా రెస్పాన్స్ వస్తోంది. సినిమాను పొగుడుతూ తమ తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు పెడుతున్నారు..
Mahesh Babu Praises
తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh babu) ఈ రాయన్ సినిమాను తిలకించి మూవీ గురించి తన అభిప్రాయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. రాయన్ సినిమా అసాంతం ధనుష్ తన నటనతో ఆకట్టుకున్నాడని అంతేగాక బ్రిలియంట్‌గా డైరెక్ట్ చేశాడని ప్రకాశ్ రాజ్, సందీప్ కిషన్, ఎస్జే సూర్య ఇతర నటీనటులు అదర్భుతంగా నటించారని, మ్యాస్ట్రో రెహమాన్ సంగీతం ఎలక్ట్రీఫైయింగ్ ఉందని ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అంటూ చిత్రంపై పొగడ్తల వర్షం కురిపించారు. దీనికి ధనుష్ స్పందిస్తూ మీరు మా రాయన్ సినిమాను చూడడం ప్రశంసించడం హృదయాలను తట్టింది, మా టీమ్ అంతా థ్రిల్ ఫీలయ్యామని అన్నారు. ఎస్జే సూర్య మీ ట్వీట్ మాకు ఎంతో సపోర్టింగ్ ఉంది లవ్లీ ట్వీట్ లవ్ యూ బాబు గారు అంటూ రీ ట్వీట్ చేయగా సందీప్ కిషన్, అపర్ణ బాల మురళి లు కృతజ్ణతలు తెలిపారు.
Also Read : Raayan OTT : ఆ ఓటీటీలోకి రానున్న ధనుష్ నటించిన ‘రాయన్’ సినిమా