Mahesh Babu: బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి… సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతంది అనేది మాత్రం ఇంతవరకు చెప్పలేదు. ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu)… త్రివిక్రమ్ తో కలిసి గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ భారీ విజయం తరువాత రాజమౌళి… కాస్తా రెస్ట్ మోడ్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఓ సినిమా ప్రమోషన్ కోసం వీరిద్దరూ ఒకే వేదిక మీదకు రానుండటంతో వీరి సినిమా గురించి అప్ డేట్ వస్తుందని అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.
Mahesh Babu – ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేయనున్న మహేష్-రాజమౌళి
అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, రష్మిక జంటగా, అనిల్ కపూర్, బాబి డియోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘యానిమల్’. డిసెంబరు 1 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సంబందించిన ప్రమోషన్ ను చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రారంభించింది. ‘యానిమల్’ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో భారీ ఎత్తున ప్రమోషన్ చేస్తున్నారు.
దర్శకుడు తెలుగు వాడు కావడంతో ఈ ప్రమోషన్ రేంజ్ మరింత పెంచేసింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలోనే ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీ (దూలపల్లి)లో సోమవారం (నవంబరు 27) సాయంత్రం నిర్వహించడానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు ఆ ఈవెంట్‌కు మహేశ్ బాబు, రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీనితో ‘యానిమల్’ సినిమాతో పాటు మహేష్-రాజమౌళి సినిమా గురించి ఏదైనా అప్ డేట్ వస్తుందని సినీ ప్రియులు, నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మహేష్-రాజమౌళిల సినిమా అప్ డేట్ వచ్చేనా…
‘యానిమల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా హాజరవుబోతున్న మహేష్ బాబు, రాజమౌళిల గురించి అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ప్రకటించిన కొన్ని నిమిషాల్లోనే… ఆ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ కాంబో గురించి ఏ చిన్న విషయం బయటకొచ్చినా ట్రెండింగ్ లోనికి వెళ్ళడం ఖాయం.
Also Read : Parineeti Chopra: ఫ్యాన్ క్లబ్స్‌కు బాలీవుడ్ బ్యూటీ స్ట్రాంగ్ వార్నింగ్