మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న గుంటూరు కారం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. పరశురామ్ తీసిన సర్కారువారి పాట సూపర్ సక్సెస్ కావడంతో తదుపరి చిత్రం త్రివిక్రంతో తీస్తున్నాడు.
ఇందులో కీలకపాత్ర పోషిస్తోంది శ్రీలీల. మొదటగా పూజా హెగ్డేను అనుకున్నారు. కానీ అనుకోకుండా ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గతంలో త్రివిక్రం శ్రీనివాస్ , మహేష్ బాబుతో కలిసి రెండు సినిమాలు తీశారు. ఒకటి అతడు ఇది తెలుగు సినిమాను షేక్ చేసింది ఆ తర్వాత ఖలేజా చిత్రం వసూలు చేసినా ఆశించిన మేర టాక్ రాలేదు.
ప్రస్తుతం మహేష్ బాబుతో త్రివిక్రం శ్రీనివాస్ మూడో చిత్రం. ఇక త్రివిక్రం బన్నీతో తీసిన అల వైకుంఠ పురంలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇదిలా ఉండగా మాటలతో పాటు సినిమాను మరింత హైలెట్ గా అద్భుతంగా తీసే పనిలో పడ్డాడు దర్శకుడు.
ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ , టీజర్ దుమ్ము రేపింది. ప్రత్యేకించి మహేష్ బాబు ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో హెయిల్ స్టైల్ డిఫరెంట్ గా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. తాజాగా మహేష్ న్యూ లుక్ అదుర్స్ అనేలా ఉంది.