Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్లు మహేష్ బాబు, నమత్రా శిరోద్కర్ ఉత్కంఠతో ఉన్నారు. తన కొడుకు గౌతమ్ ఘట్టమనేని (ఇంటర్) గ్రాడ్యుయేషన్‌పై మహేష్(Mahesh Babu ) భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. గౌతమ్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలను మహేష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. “నా హృదయం గర్వంతో నిండిపోయింది. మీ గ్రాడ్యుయేషన్‌కు అభినందనలు. మీరు జీవితపు తదుపరి పాఠాన్ని వ్రాయాలి. మీరు ఎప్పటిలాగే గొప్ప పని చేస్తారని నేను నమ్ముతున్నాను. కలలు కనడం ఆపవద్దు. మేము నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తున్నామని గుర్తుంచుకోండి. ఈరోజు నేను తండ్రిని అయినందుకు చాలా గర్వపడుతున్నాను అని మహేష్ అన్నారు”. తర్వాత మహేష్ భార్య నమ్రత కూడా గౌతమ్ గ్రాడ్యుయేషన్ పట్ల సంతోషం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకుంది.
Mahesh Babu Post..
డియర్ జిజి (గౌతమ్ ఘట్టమనేని). ఈ రోజు మీరు మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఎదుర్కొంటున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎల్లప్పుడూ మీ పట్ల నిజాయితీగా ఉండండి. మీ అభిరుచిని అనుసరించండి. కలలు కనడం ఆపవద్దు. మేము నిన్ను నమ్మినట్లే మిమ్మల్ని మీరు నమ్మండి. మీ జీవితం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లినా, మా ప్రేమ మరియు మద్దతు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ ప్రపంచం నీది. ఐ లవ్ యూ సో మచ్ అని నమ్రత ఎమోషనల్ గా రాసింది
ప్రస్తుతం మహేష్, నమ్రతల సోషల్ మీడియా పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు కూడా గౌతమ్‌కి అభినందనలు గుంటూరు కారం సినిమాతో హిట్ కొట్టిన మహేష్ ప్రస్తుతం రాజమౌళి సినిమాకు రెడీ అవుతున్నాడు.
Also Read : Laila Khan: బాలీవుడ్ నటి కుటుంబం హత్య కేసులో ముంబయి కోర్టు సంచలన తీర్పు !