Mahesh Babu Movie : రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో వస్తున్న #SSMB29 స్టోరీలో మార్పు

Hello Telugu - Mahesh Babu Movie

Mahesh Babu Movie : మహేష్ బాబు తెలుగు సినిమా చేస్తాడా? ప్రాంతీయ చిత్రాలకు దూరం కావాలని ఆలోచిస్తున్నారా? అందుకే గుంటూరు కారంలో ఇంత ఓపెన్ అయ్యి డ్యాన్స్ ఇంత దారుణంగా చేసారా? మహేష్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?

ఇదిలా ఉంటే రాజమౌళి ఇప్పుడు మహేష్ సినిమా స్క్రిప్ట్ మారుస్తున్నాడా? ఏం జరిగింది? మహేష్ బాబు నిన్నటి వరకు గుంటూరు కారంతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ సినిమా నుంచి బయటకు వస్తున్నాడు.

Mahesh Babu Movie Updates

చిన్న విరామం తర్వాత మళ్లీ రాజమౌళి సినిమాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు సూపర్ స్టార్. జక్కన్న సినిమాతో తన మార్కెట్ పెరుగుతుందని మహేష్ ఇప్పటికే కృతనిశ్చయంతో ఉన్నాడు. రాజమౌళి సినిమా తర్వాత, పాన్-ఇండియన్ మార్కెట్ తమను ఆకర్షిస్తున్నట్లు హీరోలందరూ గ్రహించారు. మహేష్ కూడా అదే మాట చెప్పాడు. ప్రాంతీయ సినిమాలో నటించినా, నటించకపోయినా గుంటూరు కారం అభిమానులకు కృతఙ్ఞతలు చెప్పారు. రాజమౌళి సినిమాకి మూడేళ్లు పడుతుంది.

సినిమాని ఎంత త్వరగా పూర్తి చేసినా.. 2027లో మాత్రం అభిమానులందరినీ ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు. మరోవైపు మహేష్(Mahesh Babu) కూడా సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే, దర్శకుడు రాజమౌళి SSMB 29 స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసాడు. మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇదొక అడ్వెంచరస్ థ్రిల్లర్. ప్రధాన పాత్రలో ప్రపంచ యాత్రికుడిగా కనిపిస్తాడని తెలిసింది. ప్రధాన కథలో ఎలాంటి మార్పులు లేకపోయినా స్క్రిప్ట్‌లో చిన్నపాటి మార్పులు చేయాలని దర్శకుడు రాజమౌళి తన బృందానికి సూచించినట్లు తెలిసింది. ఈ సినిమా చిత్రీకరణ 2024 చివర్లో ప్రారంభం కానుంది.

Also Read : Actor Mohan Babu : మోహన్ బాబు ఫిల్మ్ నగర్ లో రామునికి ప్రత్యేక పూజలు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com