Mahesh Babu: ‘గుంటూరు కారం’ సినిమా తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించబోయే తరువాత సినిమా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న SSMB 29 (వర్కింగ్ టైటిల్). శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ అత్యంత భారీ బడ్జెట్ సినిమాపై ఇప్పటికే అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డు అందుకుని, హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రశంసలు పొందిన రాజమౌళి… ఈ సినిమాపై చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన రాజమౌళి… షూటింగ్ ను గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Mahesh Babu Photo Shoot..
రాజమౌళితో సినిమా అంటే హీరో కనీసం మూడేళ్ళు కేటాయించాల్సిందే. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కూడా ఆ ప్రాజెక్టు కోసం మూడేళ్ళ పాటు పనిచేసే అవకాశం కనిపిస్తోంది. దీనితో మహేశ్ ఫ్యాన్స్ నిరుత్సాహం చెందకుండా… వారితో ప్రత్యేకంగా ఫోటో షూట్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అతి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రాబోతున్నట్లు సమాచారం. అదేగాని నిజమైతే… మహేశ్ అభిమానుల ఆనందం గురించి మాటల్లో వర్ణించలేము. మెగా హీరోలు ఇటీవల కాలంలో అభిమానుల కోసం ప్రత్యేకంగా ఫోటో షూట్ ను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి సినిమా కోసం మహేశ్ బాబు మూడేళ్ళ పాటు అభిమానులకు దూరంగా ఉండాల్సి వస్తే… ఫోటో షూట్ అతని అభిమానులకు అమితానందాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు.
Also Read : Shreya Ghoshal: రూ. 240 కోట్ల ఆస్తులతో ధనిక గాయనిగా శ్రేయా ఘోషల్ !