Mahesh Babu in Germany: జర్మనీలో మహేశ్‌ బాబు ! రాజమౌళి సినిమా కోసమేనా ?

జర్మనీలో మహేశ్‌ బాబు ! రాజమౌళి సినిమా కోసమేనా ?

Hello Telugu - Mahesh Babu in Germany

Mahesh Babu: ‘గుంటూరుకారం’ సినిమా హిట్ తో జోష్ మీద ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు… ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి దర్వకత్వంలో నటించబోయే తరువాత సినిమాకు సిద్ధమౌతున్నాడు. రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు గతంలో నిర్మాత కేఎల్ నారాయణ ప్రకటించారు. దీనితో రాజమౌళి-మహేశ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్‌ అడ్వెంచరస్‌ మూవీకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, వేసవిలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీనితో దర్శకుడు రాజమౌళి… ఈ సినిమాకు సంబంధించి ప్రీప్రోడక్షన్‌ వర్క్స్‌ను ఇటీవలే మొదలు పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు జర్మనీ వెళ్ళడంతో… ఈ సినిమా గురించేననే చర్చ జరుగుతోంది.

Mahesh Babu Movie Updates

ఇటీవల మహేశ్ బాబు జర్మనీ వెళ్లారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో తన లుక్, మేకోవర్‌ గురించిన సాంకేతికపరమైన విషయాల గురించిన పనుల కోసం మహేశ్‌బాబు(Mahesh Babu) జర్మనీ వెళ్లారనే టాక్‌ వినిపిస్తోంది. సంక్రాంతి అయిపోగానే మహేశ్ విదేశాలకు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఎప్పుడూ ఫ్యామిలీతో వెళ్ళే మహేశ్… ఈ సారి ఒంటరిగా వెళ్ళడం రాజమౌళి సినిమా కోసమే అనే టాక్ నడుస్తోంది. రాజమౌళి తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించిన టెక్నికల్‌ అంశాలపై చర్చించేందుకు అక్కడకు వెళ్లారని టాలీవుడ్‌ వర్గాల టాక్‌. సాధారణంగా రాజమౌళి తన సినిమా మొదలు పెట్టేటప్పుడు… గ్రాండ్ లాంచింగ్ ఉంటుంది. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు మీడియా సమావేశం నిర్వహించి… తన ప్రాజెక్ట్‌ గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తుంటారు. ఈ నేపథ్యంలో మహేశ్‌ మూవీ విషయంలో కూడా త్వరలో అధికారిక సమాచారం వస్తుందని అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : Hanuman 1st Week Collections : రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతున్న ‘హనుమాన్’

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com