Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు… రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణతో పాటు న్యూలుక్ ను ట్రై చేస్తున్న సంగతి తెలిందే. ఈ నేపథ్యంలోనే ఈ లుక్ బయటకు రాకుండా ఉండేందుకు మహేశ్ బాబు(Mahesh Babu) బయట ఎక్కడా కనిపించడం లేదు. అయితే తాజాగా ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు తప్పనిసరి పరిస్థితుత్లో హాజరైన మహేశ్ ను చూసి అతని సోదరి మంజుల ఆటపట్టించింది. రాజమౌళి సినిమా కోసం పెంచిన జుట్టుతో ఆ ఫంక్షన్ కు హాజరైన మహేశ్ బాబును… మంజుల జుట్టు పట్టుకుని లాగడం… దానికి మహేశ్ బాబు క్యూట్ లుక్ ఇవ్వడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Mahesh Babu Comedy
ఈ సందర్భంగా అక్కాతమ్ముళ్ళ మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ… వారిద్దరి మధ్య ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనంగా నిలుస్తోంది. అసలు వారి మధ్య జరిగిన సంభాషణ ఏంటంటే…
మంజుల: ఆ హెయిర్ స్టైల్ ఏంట్రా?
మహేష్: కొత్త స్టైల్ అక్కా… రాజమౌళి సినిమా కోసం పెంచుతున్నా. బావుందా?
మంజుల: ఒరేయ్ తమ్ముడు.. నవ్వు ఆగట్లేదురా.. (జుత్తు పట్టుకుని)
మహేష్: అలా నవ్వకే.. చాలా కష్టపడి జుట్టు పెంచాను.. దీని వెనుక ఎంత కష్టం ఉందో నీకు తెలీదు.
మంజుల: ఏం.. కష్టమోగానీ నాకైతే నవ్వు ఆగట్లేదు రా!!
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ (వర్కింగ్ టైటిల్)కోసం సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మహేష్ రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫొటో షూట్స్ పూర్తయ్యాయి. మహేశ్ బాబు కసరత్తులు మొదలుపెట్టారు. ఇటీవల దుబాయ్ వెళ్లిన ఆయన అక్కడ స్కేటింగ్ ప్రాక్టీస్ చేసి వచ్చారని సన్నిహితుల నుంచి సమాచారం అందింది. ప్రస్తుతం ఆయన కొత్త లుక్‌లో స్టైలిష్‌ఆ కనిపిస్తున్నారు.
Also Read : Premikudu: ప్రభుదేవా ‘ప్రేమికుడు’ మళ్లీ వస్తున్నాడు !