Mahesh Babu: మహేశ్‌ బాబు అభిమానులపై నమ్రత ఆసక్తికర పోస్ట్‌

మహేశ్‌ బాబు అభిమానులపై నమ్రత ఆసక్తికర పోస్ట్‌

Hello Telugu - Mahesh Babu

Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో పాటు ఆయన అభిమానులను ఉద్దేశించి నమ్రత శిడోత్కర్ ఘట్టమనేని ఆసక్తికరమైన పోస్ట్‌ పెట్టారు. ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మహేశ్ బాబు ఎమోషన్ అయిన వీడియోను ఇన్ స్టాలో షేర్ చేయడంతో పాటు అభిమానులను ఉద్దేశ్యించి పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ‘‘మహేశ్‌ అభిమానుల గురించి ఇప్పటికే ఎంతోమంది గొప్పగా చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఆయన్ని ఆదరిస్తున్నారు. ప్రతి ప్రయత్నంలో అండగా నిలిచి… మరింత కష్టపడి పనిచేసేందుకు దోహదపడుతున్నారు. గుంటూరులో అభిమానులు చూపించిన ప్రేమను చూసి ఓ విషయం గర్వంగా చెప్పాలని ఉంది. మహేశ్‌… అభిమానులకు మీరొక ఎమోషన్‌… ఈ ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా’’ అని ఆమె పేర్కొన్నారు. నమ్రత పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

గుంటూరు వేదికగా మంగళవారం నిర్వహించిన ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మహేశ్ బాబు(Mahesh Babu)… తన అభిమానులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘మీరెప్పుడూ నా గుండెల్లో ఉంటారు. సంక్రాంతి నాకు, నాన్నగారికి బాగా కలిసొచ్చిన పండగ. ఆ సీజన్‌లో మా చిత్రం విడుదలైతే అది బ్లాక్‌బస్టరే. ఈసారి కూడా అదే రిపీట్‌ అవుతుంది. కానీ, ఇప్పుడు నాన్న లేరు. ఆయన నా సినిమాలు చూసి రికార్డులు, కలెక్షన్ల గురించి చెబుతుంటే ఆనంద పడేవాడిని. ఆ సంగతులన్నీ మీరే చెప్పాలి. ఇక నుంచి మీరే నాకు అమ్మ, నాన్న, అన్నీ’’ అంటూ ఎమోషన్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన నమ్రత ఈ పోస్ట్‌ చేశారు.

Mahesh Babu – ‘సొంతగడ్డపై జరగడం ఆనందంగా ఉంది.. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు’- మహేశ్

గుంటూరు వేదికగా నిర్వహించిన ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవంతం కావడంతో మహేశ్ బాబు ఎక్స్ ద్వారా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహేశ్‌బాబు తన ట్వీట్‌లో రాస్తూ..’ థ్యాంక్ యూ గుంటూరు!! నా సినిమా ఈవెంట్‌ హోమ్‌టౌన్‌లో జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఇది గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞాపకం. మీ అందరినీ ప్రేమిస్తున్నా… నా సూపర్ ఫ్యాన్స్‌ను మళ్లీ చూడాలని ఎదురుచూస్తున్నా. అతి త్వరలో మళ్లీ కలుద్దాం. ఇప్పుడే సంక్రాంతి మొదలవుతోంది. నిన్న జరిగిన కార్యక్రమానికి సహకరించిన గుంటూరు పోలీస్ డిపార్ట్‌మెంట్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ చేశారు.

Also Read : Hero Vishal: కెప్టెన్‌ విజయకాంత్ సమాధి వద్ద హీరో విశాల్‌ భావోద్వేగం !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com