Mahesh : ప్రిన్స్ మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను ప్రాణ ప్రదంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య, నటి నమ్రతా శిరోద్కర్ పుట్టిన రోజు ఇవాళ. జనవరి 22 కావడంతో సోషల్ మీడియా వేదికగా అరుదైన ఫోటోను పంచుకున్నారు. ఇన్ స్టాలో నువ్వు లేని జీవితం శూన్యం, నువ్వు వచ్చాకే నాకు వెలుగు వచ్చిందంటూ పేర్కొన్నారు మహేష్ బాబు(Mahesh). ప్రస్తుతం ఆయన పంచుకున్న ఫోటో, కామెంట్స్ వైరల్ గా మారాయి.
Mahesh Babu Comment
నమ్రతా శిరోద్కర్ కోసం హృదయపూర్వక సందేశాన్ని పంచుకున్నారు. ఇవాల్టితో ఆమెకు 53 ఏళ్లు.
“హ్యాపీ బర్త్‌డే, నమ్రతా. ప్రతి రోజును ప్రకాశవంతంగా, మెరుగ్గా చేసినందుకు ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు మహేష్ బాబు.
నమ్రత శిరోద్కర్, మహేష్ బాబు దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు గౌతం, కూతురు సితార మోస్ట్ పాపులర్ అయ్యారు. కొడుకు, కూతురు కూడా తల్లి నమ్రతా శిరోద్కర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని బర్త్ డేలు జరుపుకోవాలంటూ కోరారు సోషల్ మీడియా వేదికగా. నువ్వు ఎప్పుడూ మా గురించి, మా బాగోగుల గురించి పట్టించుకున్న తీరు మమ్మల్ని నిన్నుమరింత గొప్పగా చేసేలా మార్చేసిందంటూ పేర్కొన్నారు .
మహేష్ , పిల్లలతో పాటు సినీ , వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు నమ్రతా శిరోద్కర్ కు బర్త్ డే విషెస్ తెలియ చేశారు.
Also Read : IT Raids Shocking Tollywood : టాలీవుడ్ లో ఐటీ దాడుల కలకలం