Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కలిశారు. ఆదివారం తెల్లవారుజామున సల్మాన్ ఇండి వద్ద జరిగిన కాల్పుల ఘటనపై ఆయనను కలిసి ఆరా తీశారు. సల్మాన్ ఖాన్ ఇంటికెళ్లిన ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే… భద్రతా గురించి అడిగి తెలుసుకున్నారు. ఫైరింగ్ ఘటనపై పోలీసుల తీసుకున్న చర్యలపై సల్మాన్‌తో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Salman Khan…
ఈనెల 14 తెల్లవారు జామున గుర్తు తెలియని దుండగులు సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పులు జరిపింది తామే అంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. పంజాబ్ ర్యాప్ సింగ్ సిద్ధూ మూసేవాలా హత్యకేసులో లారెన్స్ బిష్ణోయ్ జైలులో ఉన్నప్పటికీ… సల్మాన్ ఖాన్(Salman Khan) కు పలుమార్లు ఆయన హెచ్చరికలు జారీచేసారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం ముంబైలోని సల్మాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ సైకిల్ ద్వారా పారిపోయారు. ఆ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కాల్పుల ఘటనలో విక్కీ గుప్తా(24), సాగర్ పాల్ (21) నిందితులుగా గుర్తించిన ముంబై పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ లోని భుజ్‌లో వారిద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
Also Read : Mammootty: జూన్ 13న మమ్ముట్టి ‘టర్బో’ !