Maharaja First Look : మహరాజా ఫస్ట్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. తమిళ సినీ రంగంలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు విజయ్ సేతుపతి. ఆయన తాజాగా అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ చిత్రం భారీ ఆదరణ చూరగొంది.
తాజాగా తను కీలక పాత్ర పోషించిన మహారాజా చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ ను సోమవారం పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి.
Maharaja First Look Trending
ఇక మహారాజా చిత్రంలో విజయ్ సేతుపతితో(Vijay Sethupathi) పాటు అనురాగ్ కశ్యప్ , మమతా మోహన్ దాస్ , అభిరామి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇక నటుడి కెరీర్ లో ఈ మూవీ 50వది కావడం విశేషం.
మహారాజా చిత్రానికి రచన, దర్శకత్వం వహించాడు నితిలన్ సామినాథన్. చెవికి గాయమైన విజయ్ సేతుపతి కుర్చీలో కూర్చున్న సన్నివేశానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కెవ్వు కేక అనిపించేలా ఉంది.
పోస్టర్ చూశాక చీకటి కథాంశాన్ని అందిస్తుందని అనుకోవచ్చు. ఇక మహారాజాలో భాగం పంచుకున్నందుకు ఆనందంగా ఉందన్నాడు అనురాగ్ కశ్యప్. ప్యాషన్ స్టూడియోస్ , నితలన్ సామినాథన్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలియ చేస్తున్నట్లు తెలిపాడు.
Also Read : Malaysia PM Praise : సూపర్ స్టార్ సింప్లిసిటీ సూపర్