Madras High Court : విజ‌య్ మూవీకి కోర్టు షాక్

నాలుగు షోల‌కు నో ప‌ర్మిష‌న్

త‌మిళ‌నాడు – లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన లియో చిత్రానికి అడుగడుగునా అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో డీఎంకే సర్కార్ కు లోపాయికారిగా మ‌ద్ద‌తు ఇచ్చాడు త‌ళ‌ప‌తి జోసెఫ్ విజ‌య్. ఈ చిత్రంలో విజ‌య్ తో పాటు త్రిష కృష్ణ‌న్, సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించారు.

సినిమాకు సంబంధించి మూవీ మేక‌ర్స్, నిర్మాత‌లు ముంద‌స్తుగా టికెట్ల‌ను అమ్మేందుకు, ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చేందుకు ప‌ర్మిష‌న్ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వానికి కోరారు. దీనిపై కోర్టు నిరాక‌రించింది. తాము ఒప్పుకునే ప్ర‌సక్తి లేదంటూ స్ప‌ష్టం చేసింది.

దీంతో మూవీ మేక‌ర్స్ హుటా హుటిన మ‌ద్రాస్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. త‌మ‌కు స్పెష‌ల్ షోస్ వేసుకునేందుకు ఛాన్స్ ఇవ్వాల‌ని కోరారు. దీనిపై విచారించిన కోర్టు మంగ‌ళ‌వారం సంచ‌ల‌న తీర్పు చెప్పింది. షోస్ వేసుకునేందుకు మ‌ద్రాస్ కోర్టు నిరాక‌రించింది.

లియో సినిమాకు సంబంధించి ఆడియో లాంచ్, ప్ర‌మోష‌న్స్ కోసం ఎలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌లేదు. ఇదిలా ఉండ‌గా లోకేష్ క‌న‌గ‌రాజ్ కు విజ‌య్ తో ఇది రెండో సినిమా. ఆయ‌న త‌ళ‌ప‌తితో మాస్ట‌ర్ తీశాడు. అది బిగ్ స‌క్సెస్ అయ్యింది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com