బాలీవుడ్ లో ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తుకు వచ్చేది ముందుగా మాధురీ దీక్షిత్ నేనే. సినిమాలు తగ్గినా బుల్లి తెరపై టాప్ లో కొనసాగుతోంది. రియాల్టీ షోస్ లో నటిస్తూ హల్ చల్ చేస్తోంది. పిల్లల తల్లి అయినా ఇంకా తనలో అందం ఏ మాత్రం తగ్గలేదని అంటోంది. అలనాడు త్రిదేవ్ , తేజాబ్ , సాజన్ , దిల్ తో పాగల్ హై , హమ్ ఆప్ కే హై కౌన్ , తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది మాధురి దీక్షిత్ నేనే.
తాజాగా ఆసక్తికరమైన అంశం పంచుకున్నారను. తన భర్త శ్రీరామ్ నేనేతో కలిసి పంచక్ మరాఠీ మూవీపై అంచనాలు పెంచుకున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 5న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు జయంత్ జాతర్ , రాహుల్ అవతే దర్శకత్వం వహించారు.
సినిమా గురించి తన ఆలోచనలను పంచుకున్నారు మాధురీ దీక్షిత్ నేనే. పంచక్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మనలో ప్రతి ఒక్కరికీ మూఢ నమ్మకాలు ఉంటాయి. అసంజమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తాయి. చివరకు భయపడేలా చేస్తాయి. వీటి నుండి ఎలా కాపాడు కోగలమనే దానిపైనే సినిమా ఫోకస్ ఉంటుందన్నారు మాధురీ. అత్యుత్తమ తారాగణం ఇందులో నటించడం విశేషం.