Madha Gaja Raja : ఖుష్బు సుందర్ సారథ్యంలో విశాల్, వరలక్ష్మీ శరత్ కుమార్, అంజలి కలిసి నటించిన మధ గజ రాజా చిత్రం ఊహించని రీతిలో సక్సెస్ టాక్ అందుకుంది. మూవీ మేకర్స్ కు కాసులు కురిపిస్తోంది. తాజా సినీ వర్గాల ప్రకారం వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ. 60 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఈ సినిమా 2013లోనే రావాల్సి ఉంది. కానీ అనుకోని అవాంతరాల కారణంగా మూవీ విడుదల ఆలస్యమైంది.
Madha Gaja Raja Movie Collections
ఈ చిత్రంలో సంతానం, సోనూ సూద్ కీలక పాత్రల్లో నటించారు. పూర్తిగా కామెడీ, థ్రిల్లర్ నేపథ్యంగా సాగింది మధ గజ రాజా(Madha Gaja Raja). అటు తమిళంలో ఇటు తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది విశాల్ రెడ్డికి. ఇక శరత్ కుమార్ ముద్దుల కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ ఫుల్ బిజీగా ఉంది. తను లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు ప్రయారిటీ ఇస్తోంది. ప్రధానంగా ప్రతి నాయకురాలి పాత్రను పోషిస్తోంది.
ఇటీవలే పాన్ ఇండియా మూవీకి సంతకం చేసింది. ఇది తెలుగులో స్ట్రెయిట్ మూవీ . మరో వైపు ఇంకో కీలక పాత్రలో నటి అంజలి నటిస్తోంది. తను ఇటీవలే దిగ్గజ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి నటించింది గేమ్ ఛేంజర్ మూవీలో. ఇది అట్టర్ ప్లాప్ అయ్యింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించినా మెగా ఫ్యామిలీ మొత్తం దీని కోసం ప్రచారం చేసినా ఎవరూ పట్టించు కోలేదు.
కాగా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల మధ్యలోకి వచ్చిన మధ గజ రాజా చిత్రం అద్భుత విజయాన్ని సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు మూవీ మేకర్స్.
Also Read : Beauty Rashmika-Salman : కండల వీరుడితో నేషనల్ క్రష్