అప్పుడెప్పుడో శేఖర్ కమ్ముల కాలేజీ నేపథ్యంగా తీసిన హ్యాపీ డేస్ జనాలను బాగా ఆకట్టుకునేలా చేసింది. సేమ్ నేపథ్యంతో ఫుల్ వినోదం, హాస్యాన్ని పండించేలా తీశారు మ్యాడ్ మూవీని. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. పంచ్ లు, ప్రాసలతో హుషారు కలిగించేలా ఉండడంతో కలెక్షన్లు కూడా ఆశించిన దానికంటే ఎక్కువగా వస్తున్నాయని టాక్.
మ్యాడ్ మూవీ కంటే ముందు ప్రముఖ నిర్మాత నాగ వంశీ ఓ సంచలన ప్రకటన చేశాడు. మ్యాడ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకోవడం ఖాయమన్నారు. అంతే కాదు ఆయన సవాల్ కూడా విసిరారు. అదేమిటంటే మీరు నవ్వక పోతే మీరు తీసుకున్న టికెట్ డబ్బులు వాపస్ ఇస్తామని ప్రకటించారు. ఇదే నా ఛాలెంజ్ అంటూ చెప్పారు. ఇది బాగా పేలింది. తొలిసారి నిర్మాత ఇలా చెప్పడంతో అంతా ఆసక్తితో ఎదురు చూశారు మ్యాడ్ చిత్రం కోసం.
విడుదలై మూడు రోజులే అయినప్పటికీ రూ. 3.1 కోట్లను రాబట్టింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా చిత్రీకరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక ఇందులో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే జాతి రత్నాలు డైరెక్టర్ మ్యాడ్ మూవీలో నటించడం.
జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ , సంగీత్ శోభన్ , రామ్ నితిన్ లు నటించారు. అందరూ నవ్వించేందుకు ప్రయత్నం చేశారు. వారి కృషి ఫలించింది. మొత్తంగా మ్యాడ్ జనాన్ని పిచ్చోళ్లను చేసింది.