Mad Square Sensational : మ్యాడ్ స్క్కేర్ ట్రైల‌ర్ మ‌స్తుగుంది

మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు

Mad Square Sensational

Mad Square : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై నాగ‌వంశీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన చిత్రం మ్యాడ్ స్క్వేర్(Mad Square). క‌ళ్యాణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. వాస్త‌వానికి మార్చి 25న మంగ‌ళ‌వారం వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. కానీ ఎందుక‌నో దానిని మార్చేసి ఇవాళ బుధ‌వారం విడుద‌ల చేశారు. మొత్తంగా నాగ‌వంశీ ముందుగానే ప్ర‌క‌టించిన‌ట్లు కెవ్వు కేక అనిపించేలా ఉంది ట్రైల‌ర్. ఈ మూవీ మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఎప్ప‌టి లాగే క‌డుపుబ్బా న‌వ్వించేలా ఉంది.

Mad Square Movie Trailer Updates

ఇందులో నార్నే నితిన్, సంగీత్ శోభ‌న్, రామ్ నితిన్ , ప్రియాంక జవాల్కర్ , త‌దిత‌రులు న‌టించారు. నాగ వంశీ ఎస్ సమర్పణలో హారిక సూర్యదేవర ,సాయి సౌజన్య నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు. షామ్‌దత్ సినిమాటోగ్రఫీ. నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్, టీజ‌ర్ , సాంగ్స్ కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.

ఇక భీమ్స్ హ‌వా కొన‌సాగుతోంది. త‌ను సంగీతం అందించిన చిత్రం సంక్రాంతికి వ‌స్తున్నాం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఏకంగా రూ. 300 కోట్లు వ‌సూలు చేసింది. దీనికి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాకు సంగీతం, పాట‌లు హైలెట్ గా నిలిచాయి. అద‌న‌పు బ‌లంగా మారింది మూవీ విజ‌యానికి. ప్ర‌స్తుతం మ్యాడ్ -2 సీక్వెల్ మూవీకి కూడా త‌ను ఇచ్చిన మ్యూజిక్ మ్యాజిక్ చేసేసింది. సినిమా మొత్తం న‌వ్వులు పూయించేలా ఉంది. ఇక ట్రైల‌ర్ కూడా ఆక‌ట్టుకునేలా ఉంది. సినిమా మాత్రం ఎండా కాలంలో ఫుల్ ఎంజాయ్ చేసేలా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.

Also Read : ఏకాంతం..ధ్యానం స‌మంత మార్గం

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com