Mad Square : సితార ఎంటర్ టైనర్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మించిన చిత్రం మ్యాడ్ స్క్వేర్(Mad Square) సీక్వెల్ దుమ్ము రేపుతోంది. కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఈ ఏడాది అంతగా అంచనాలు లేకుండా విడుదలైన చిత్రాలలో ఇది ఒకటి. ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. మారి ముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించిన దానికంటే అత్యధిక వసూళ్లు చేసింది. ఏకంగా రూ . 100 కోట్లు కొల్లగొట్టింది. ఇక నటుడు నాని నిర్మాణ సారథ్యంలో నిర్మించిన చిత్రం కోర్ట్. దీనిని రామ్ జగదీశ్ తీశాడు. ఇది పూర్తిగా పోక్సో చట్టం మీద తీశాడు.
Mad Square Movie Collections Sensational
ప్రియదర్శి, హర్షవర్దన్, శివాజీ కీలక పాత్రల్లో నటించింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా ఓటీటీ సంస్థ రూ. 8 కోట్లకు తీసుకుంది. ఇది రికార్డ్ అని చెప్పక తప్పదు. ఇక మ్యాడ్ తొలి చిత్రం సూపర్ హిట్. తర్వాత సీక్వెల్ కూడా దూసుకు పోతోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. త్వరలోనే రూ. 50 కోట్ల క్లబ్ లోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. వరల్డ్ వైడ్ గా తాజా సమాచారం మేరకు . 42.40 కోట్లు వసూలు చేసింది. వీకెండ్ లో అది మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
మ్యాడ్ స్క్వేర్(Mad Square) మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో పాటు మరో మూవీ నితిన్ , శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ కూడా విడుదలైంది. కానీ ఆశించిన రీతిలో ఆడలేదు. ఇక మ్యాడ్ అయితే పిచ్చెక్కించేలా చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా రూ. 74 కోట్లు క్రాస్ చేసినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రంలో నార్నే నితిన్ , సంగీత్ శోభన్ , రామ్ నితిన్ , ప్రియాంక జువాల్కర్, విష్ణు ఓయు, సునీల్ , సుధాకర్, సత్యం రాజేష్, రఘు బాబు, మురళీధర్ గౌడ్, కార్తికేయ సామల, రవి ఆంథోనీ పుడోటా, అనిష్ కురువిల్లా, కె. వి. అనుదీప్, శ్రీ గౌరీ ప్రియ, రెబా మోనికా జాన్ నటించారు. భీమ్స్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది.
Also Read : Seetha Payanam Sensational :సీతా పయనం సంచలనం