Mad Square : సితార ఎంటర్టైన్ పతాకంపై ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మించిన మ్యాడ్ దుమ్ము రేపుతోంది. కలెక్షన్ల వేట కొనసాగిస్తోంది. మార్చి 28వ తేదీన మ్యాడ్ మూవీతో పాటు నితిన్ రెడ్డి, శ్రీలీల కలిసి నటించిన రాబిన్ హుడ్ చిత్రం కూడా విడుదలైంది. కానీ పూర్తిగా నవ్వులు పూయించింది ఈ మూవీ. మ్యాడ్ కు ఇది సీక్వెల్ . ఇందులో నార్నే నితిన్, సంగీత్, రామ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్.
Mad Square Movie Collections
విడుదలైన తొలి షో నుంచి భారీ ఎత్తున కలెక్షన్స్ సాధించింది. వసూళ్ల వేటలో ముందంజలో ఉంది. ఇప్పటికే ఈవెంట్ సందర్బంగా నిర్మాత నాగవంశీ చేసిన ప్రకటనకు తగినట్టుగానే సూపర్ సక్సెస్ టాక్ తో ముందుకు సాగడంతో దర్శక, నిర్మాతలు, మూవీ టీం సంతోషం వ్యక్తం అవుతోంది. తొలి రోజు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించడం విశేషం.
రాబోయే రోజులలో మరింత ఆకట్టుకునేలా సాగుతోంది మ్యాడ్ -2(Mad Square) చిత్రం. వరల్డ్ వైడ్ గా రూ. 21 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి బ్రేక్ ఈవెన్ రావాలంటే రూ. 45 కోట్లు కావాల్సి ఉంది. తొలి రోజే రికార్డ్ స్థాయిలో రావడం మరింత శుభపరిణామం అని చెప్పక తప్పదు. రాబోయే రోజుల్లో మ్యాడ్ -2 సీక్వెల్ రూ. 100 కోట్లకు పైగా వసూలు చేయడం పక్కా అని అంటున్నారు సినీ క్రిటిక్స్.
Also Read : Hero Vijay Deverakonda :ఆ దర్శకుల వల్లనే ఈ స్థాయిలో ఉన్నా