Mad Square : సితార ఎంటర్ టైనర్ పతాకంపై ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మించిన సీక్వెల్ మూవీ మ్యాడ్ స్క్వేర్. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ లో ఈ చిత్రంతో పాటు నితిన్ రెడ్డి, శ్రీలీల కలిసి నటించిన రాబిన్ హుడ్ కూడా ఇదే రోజు విడుదలైంది. ఈ మూవీకి మిశ్రమ స్పందన రాగా మ్యాడ్ స్క్వేర్(Mad Square) మాత్రం రిలీజ్ అయిన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోయింది. ఓవర్సీస్ లో కూడా మంచి ఆదరణ చూరగొంది. రెండు రోజులకు కలిపి దాదాపు రూ. 30 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు సినీ ట్రేడ్ వర్గాల అంచనా.
Mad Square Movie Collections
విడుదలైన అన్ని చిత్రాలలో కంటే మ్యాడ్ స్క్వేర్ టాప్ లో కొనసాగుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాలలో దూసుకు పోతోంది వసూళ్ల పరంగా. అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఆకట్టుకుంటోంది. ప్రేక్షకులను థియేటర్ల వద్దకు రప్పిస్తోంది. నిజామ్ ఏరియాలో రూ. 4.53 కోట్లు, సీడెడెల్ రూ. 1.34 కోట్లు, అమెరికాలో రూ. 1.12 కోట్లు వసూలయ్యాయి. ఇక తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 21 కోట్లకు పైగా వసూలైంది. రెండో రోజు రూ. 9.55 కోట్లు రావడం విశేషం.
దర్శకుడు కళ్యాణ్ శంకర్ మరోసారి తనదైన స్టైల్ లో తెరకెక్కించే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అయ్యాడు. సానుకూల స్పందన, స్థిరమైన బాక్సాఫీస్ ప్రదర్శన ప్రేక్షకులను మైమరిచి పోయేలా చేస్తోంది. మొత్తంగా విజయవంతమైన చిత్రంగా మంచి టాక్ ను అందుకుంది మ్యాడ్ స్క్వేర్.
Also Read : Puri-Vijay Sethupathi Shocking :పూరీ జగన్నాథ్ విజయ్ సేతుపతి మూవీ రెడీ