ఒక్కోసారి చిన్న సినిమాలు కూడా ఆశించిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తాయి. ఆ మధ్యన ఎవరూ అంతగా పట్టించుకోని జాతిరత్నాలు బిగ్ హిట్ మూవీగా నిలిచింది. దర్శకుడి ప్రతిభ ఈ సినిమాకు ఎక్కువగా ఉపయోగపడింది. కథ డామినేట్ చేస్తే ఇక హీరో , హీరోయిన్లతో పనేంటి అంటున్నారు దర్శక, నిర్మాతలు.
గతంలో హీరో , హీరోయిన్లు ఎవరనే దానిపై సినిమాలు ఆడేవి. ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీలో హీరోలదే డామినేషన్. కానీ సీన్ మారింది. ఇప్పుడు స్టోరీ బాగుంటేనే సినిమా చూస్తున్నారు. థియేటర్లకు వస్తున్నారు. లేదంటే ముఖం మీదే డోంట్ కేర్ అంటున్నారు.
ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రామ్ చరణ్ , పూజా హెగ్డే కలిసి నటించిన ఆచార్య ను బండ కేసి కొట్టారు. ఆపై భోళా శంకర్ ను ఆదరిస్తారని అనుకున్న చిరంజీవికి కోలుకోలేని షాక్ ఇచ్చారు. స్టార్ డమ్ పని చేయదని, కథే ముఖ్యమని స్పష్టం చేశారు సినీ ఫ్యాన్స్.
ఇక అక్టోబర్ 6న విడుదలైన మ్యాడ్ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇందులో ప్రముఖ నటుడు తారక్ బామ్మర్ది కూడా నటించాడు. ఈ మూవీని వినోదాత్మకంగా, కామెడీ ఉండేలా తీశారు. ప్రస్తుతం వసూళ్లలో రికార్డు మోత మోగిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ సమర్పించిన ఈ మూవీకి బిగ్ కలెక్షన్స్ యుఎస్ లో వచ్చాయని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.