Maa Nanna Superhero: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో లూజర్ వెబ్‌సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మా నాన్న సూపర్‌హీరో(Maa Nanna Superhero)’. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన ఆర్ణ కథానాయికగా నటిస్తోంది. సీఏఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి వి. సెల్యులాయిడ్స్ పతాకంపై సునీల్ బలుసు ఈ సినిమానున నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Maa Nanna Superhero Movie Updates
ఇక టీజర్ విషయానికి వస్తే… తండ్రీకొడుకుల ప్రేమ, అనుబంధం కథాంశంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చాలా రోజుల తర్వాత పోకిరి నటుడు షాయాజీ షిండే టాలీవుడ్ అభిమానులను అలరించనున్నారు. ‘నేను కష్టపడుతున్నాను కదా నాన్న.. ఇక నువ్వేందుకు పనిచేయడం’ అన్న డైలాగ్ చూస్తుంటే ఈ మూవీ ఫుల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ‘అమ్మని అన్నం పెట్టమని అడిగితే అడుక్కున్నట్లు కాదు… నాన్న ముందు తగ్గితే ఓడిపోయినట్టు కాదు!! లాంటి ఎమోషనల్ డైలాగ్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. తండ్రీ, కుమారుల అనుబంధం, ఎమోషన్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.
Also Read : Parakramam: ఓటీటీకి వచ్చేస్తోన్న బండి సరోజ్ ‘పరాక్రమం’ ! స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?