Beauty Sreeleela :బాలీవుడ్ పై ల‌వ్లీ బ్యూటీ శ్రీ‌లీల ఫోక‌స్

పుష్ప‌2 మూవీ స్పెష‌ల్ సాంగ్ తో వైర‌ల్

Sreeleela : అందాల ముద్దుగుమ్మ శ్రీ‌లీల పుష్ప‌2 మూవీతో ఒక్క‌సారిగా హాట్ టాపిక్ గా మారారు. ఈ మూవీ జ‌నాద‌ర‌ణ పొందింది. రికార్డుల‌ను తిర‌గ రాసింది. త‌ను కేవ‌లం స్పెష‌ల్ సాంగ్ లో న‌టించింది. కిస్స‌క్ అంటూ కిర్రాక్ ఎక్కించేలా చేసింది. వామ్మో త‌న‌తో డ్యాన్స్ చేయ‌డం చాలా క‌ష్టం అంటూ కామెంట్ చేశాడు ప్రిన్స్ మ‌హేష్ బాబు. త‌ను కూడా ఫేమ‌స్.

Sreeleela Focus

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తీసిన గుంటూరు కారం మూవీలోని కుడ్చీ మ‌డ‌త పెట్టి సాంగ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. సోష‌ల్ మీడియాలో అది ఇప్ప‌టికీ టాప్ లో కొన‌సాగుతోంది. ఆ మ‌ధ్య‌న మ‌లేషియా, ఇత‌ర దేశాల‌లో కూడా ఈ పాట‌కు డ్యాన్సులు చేస్తున్నారు. ఇక రీల్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. యూత్ తో పాటు మ‌హిళ‌లు కూడా సై అంటున్నారు.

శ్రీ‌లీల(Sreeleela) స్పీడ్ ను త‌ట్టుకోలేక పోయానంటూ పేర్కొన్నాడు మ‌హేష్ బాబు. ఇక శ్రీ‌లీల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం త‌ను నితిన్ రెడ్డితో న‌టిస్తోంది. ఆ మ‌ధ్య‌న ఓ కుర్రోడితో క‌లిసి కెమెరాల‌కు చిక్కింది. త‌ను డేటింగ్ లో ఉన్న‌ట్టు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఇదంతా ట్రాష్ అంటూ కొట్టి పారేసింది ఈ చిన్న‌ది.

త్వ‌ర‌లోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. బీటౌన్ డైరెక్ట‌ర్ క‌ర‌ణ్ జోహార్ ఆఫీస్ వ‌ద్ద క‌నిపించ‌డంతో త‌ను ఏదైనా సినిమా చేస్తుంద‌ని తెగ కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్స్. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ త‌న‌యుడు ఇబ్ర‌హీం ఖాన్ తో క‌లిసి ఉన్న ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

అయితే త‌ను అత‌నితో కాకుండా టీ సీరీస్ బాస్ భూష‌ణ్ కుమార్ న‌టుడు కార్తీక్ ఆర్య‌న్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. దాని కోసం శ్రీ‌లీల‌ను సంప్ర‌దిస్తే ఓకే చెప్పింద‌ని స‌మాచారం. ఇక ఆర్య‌న్ వ‌రుస హిట్స్ తో దూసుకు పోతున్నాడు. ఇద్ద‌రి కాంబినేష‌న్ కెవ్వు కేక అంటున్నారు ఫ్యాన్స్.

Also Read : Hero Akshay Kumar :అక్ష‌య్..ట్వింకిల్ ఆస్తుల విలువ రూ. 2850 కోట్లు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com