Love Sitara : ‘లవ్ సితార’ సినిమాలో నటించడం నాకు మంచి అనుభవం

ట్రైలర్ విడుదల సంద‌ర్భంగా శోభితా ధూళిపాళ మాట్లాడుతూ....

Hello Telugu - Love Sitara

Love Sitara : శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రలో నటించిన ZEE5 ఒరిజినల్ ఫిల్మ్ ‘లవ్, సితార’ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌తో పాటు ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ని కూడా మేకర్స్ ప్రకటించారు. ‘ లవ్, సితార(Love Sitara)’ అనేక భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఈ ఫ్యామిలీ డ్రామా తెర‌కెక్కింది. ఓ కుటుంబంలోని స‌భ్యుల మ‌ధ్య ఉండే వివిధ ర‌కాలైన స‌మ‌స్య‌ల‌ను, ఎమోష‌న్స్‌ను ఎలివేట్ చేసే సినిమా ఇదని ట్రైల‌ర్‌ను చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. రోనీ స్క్రూవాలా RSVP మూవీస్ నిర్మాణంలో వందనా కటారియా దర్శకత్వంలో ఈ మూవీ తెర‌కెక్కింది. ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే… ప్ర‌కృతి అందాల‌తో ఆక‌ట్టుకునే కేరళ పచ్చటి అందాల న‌డుము తెర‌కెక్కిన క‌థే ‘ల‌వ్ సితార‌’.

తార‌ (శోభితా ధూళిపాళ) ఓ స్వతంత్ర్య భావాలున్న ఇంటీరియ‌ర్ డిజైన‌ర్‌. అంత‌ర్జాతీయంగా మంచి పేరున్న చెఫ్ అర్జున్ (రాజీవ్ సిద్ధార్థ)తో ప్రేమ‌లో పడుతుంది. వారిద్ద‌రూ పెళ్లికి ముందు తార ఇంటికి వెళ‌తారు. అక్క‌డ పెళ్లి జ‌రగ‌టానికి ముందు కుటుంబాల్లోని విభేదాలు, తెలియ‌కుండా దాగిన నిజాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. చివ‌ర‌కు ఈ జంట ప్ర‌యాణం ఎటువైపు సాగింద‌నేదే సినిమా. సోనాలి కులకర్ణి, బి.జయశ్రీ, రోడ్రిగ్స్, సంజయ్ భూటియాని, తమరా డిసౌజా, రిజుల్ రే త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. ‘ లవ్, సితార’ సెప్టెంబర్ 27న ZEE5లో ప్రీమియర్‌గా ప్ర‌ద‌ర్శితం కానుందని అధికారికంగా ఈ ట్రైలర్‌లో ప్రకటించారు.

Love Sitara Movie Updates

ట్రైలర్ విడుదల సంద‌ర్భంగా శోభితా ధూళిపాళ మాట్లాడుతూ.. ‘లవ్, సితార(Love Sitara)’లో నటించడం ఓ గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. నేను పోషించిన పాత్రలో అనేక షేడ్స్ ఉన్నాయి. చాలా వైవిధ్య‌మైన పాత్ర‌. స్వ‌తంత్య్ర భావాలున్న ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ పాత్ర‌లో న‌టించాను. నిజాయితీగా ఉండే ఓ అమ్మాయి త‌న జీవితంలో ఎదురైన స‌వాళ్ల‌ను ధైర్యంగా ఎలా ఎదుర్కొంద‌నేదే క‌థ‌. ఇందులోని ఫ్యామిలీ ఎమోష‌న్స్ ప్రతి ఒక్కరినీ ఆక‌ట్టుకుంటాయి” అని అన్నారు. రాజీవ్ సిద్ధార్థ మాట్లాడుతూ.. ట్రైలర్ అందరినీ ఆక‌ట్టుకోవ‌టం చాలా సంతోషంగా ఉంది. ఇందులో అర్జున్ అనే పాత్ర‌లో న‌టించాను. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే క్ర‌మంలో ఎలాంటి మ‌లుపు తీసుకుంది.

నా చుట్టు ఉన్న పాత్ర‌ల్లో ఉన్న సంక్లిష్ట‌త వాస్త‌విక‌త‌ను ఎంత ద‌గ్గ‌ర‌గా ఉంటాయ‌నేది ఆసక్తిని రేపే విష‌యం. శోభిత‌తో క‌లిసి న‌టించటం మంచి ఎక్స్‌పీరియెన్స్‌. జీ 5 ప్రేక్ష‌కుల‌ను ఈ ఒరిజ‌ల్ ఫిల్మ్ మెప్పిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉందని తెలిపారు. చ‌క్క‌టి ఫ్యామిలీ డ్రామా ఇదని, RSVPతో కలిసి పని చేయ‌టం, అలాగే ఈ ప్రయాణంలో ZEE5 నుంచి దొరికిన మ‌ద్ధ‌తు చూసి థ్రిల్ ఫీల్ అయ్యానని అన్నారు దర్శకుడు వందన కటారియా.

Also Read : Ustavam Movie Review : రెజీనా కసాండ్రా నటించిన ‘ఉత్సవం’ సినిమా రివ్యూ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com