Love @ 65 Trailer: లేటు వయసులో లవ్ లో పడిన జయప్రద, రాజేంద్ర ప్రసాద్ !

లేటు వయసులో లవ్ లో పడిన జయప్రద, రాజేంద్ర ప్రసాద్ !

Hello Telugu - Love @ 65 Trailer

Love @ 65 Trailer: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విఎన్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న యూనీక్ కంటెంట్ సినిమా ‘లవ్ at 65’(Love @ 65 Trailer). సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, అందాల తార జయప్రద ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్(Anup Rubens) సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో కార్తీక్‌ రాజు, స్పందన పల్లి ముఖ్య పాత్రలు పోషించగా, సునీల్, అజయ్‌ ప్రత్యేక పాత్రల్లో నటించారు. బ్రో, ఈగిల్ లాంటి భారీ సినిమాలను నిర్మించిన టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డబ్భై ఏళ్ళ వయసులో ఉన్న ఓ వృద్ధుడు… 65 ఏళ్ళ వయసున్న మరో వృద్ధురాలితో ప్రేమలో పడటం ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ ను మూవీ మేకర్స్ విడుదల చేసారు. యూనిక్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జయప్రద, రాజేంద్ర ప్రసాద్ మధ్య ట్రైలర్ లో చూపించిన ప్రేమ సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Love @ 65 Trailer – ట్రైలర్ లో ఏముందంటే ?

ఇక ట్రైలర్ విషయానికి వస్తే… ‘రాత్రి ఇక్కడి నుంచి ఇద్దరు మిస్‌ అయిపోయారు సార్‌’, ‘ఎవరు’, ‘మా కావేరి సార్‌.. మా ఆది సార్‌’, ‘ఎలా మిస్సయ్యారు’, ‘వాళ్లు లేచిపోయారు సార్‌’, ‘ఇద్దరూ మేజర్లా’, ‘కాదు సార్‌… ఆయనకి డెబ్బై నిండాయి.. ఆవిడకి ఓ అరవైఐదు దాక ఉంటాయి’ అనే డైలాగు ద్వారా సినిమాపై ఆశక్తిని ట్రైలర్ లోనే పెంచారు దర్శకుడు విఎన్ ఆదిత్య. ‘ఈ ప్రపంచం మన ప్రేమని తిరస్కరిస్తే…. ఈ ప్రపంచాన్నే మనం బహిష్కరిద్దాం’ అనే రాజేంద్ర ప్రసాద్‌ డైలాగ్…. ‘అందరూ నన్ను ఏడిపించినవాళ్లే.. కానీ, నాకోసం ఏడ్చింది నువ్వు ఒక్కడివే’ అంటూ జయప్రద చెప్పే డైలాగులు ట్రైలర్‌ కు సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయి.

Also Read : Naa Saami Ranga: ఓటీటీలోకి వచ్చేసిన కింగ్ నాగార్జున “నా సామిరంగ” !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com