తమిళ సినీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు లోకేష్ కనగరాజ్. ప్రస్తుతం పాపులర్ హీరో తలపతి జోసెఫ్ విజయ్ తో లియో తీశాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
విడుదల చేసిన పోస్టర్స్ , టీజర్, ట్రైలర్ ఆశించిన దానికంటే ఎక్కువగా ఆకట్టుకున్నాయి. యూట్యూబ్ చరిత్రలో రికార్డ్ బ్రేక్ చేసింది లియో. గతంలో ఏ భారతీయ మూవీ ఇంతటి భారీ స్థాయిలో వ్యూయర్ షిప్ చూరగొనలేదు.
విడుదలైన ట్రైలర్ 5 నిమిషాల లోపే మిలియన్ల కొద్దీ వీక్షించారు. ఈ మూవీలో విజయ్ తో పాటు అందాల ముద్దుగుమ్మ త్రిష కృష్ణన్ , అర్జున్ , సంజయ్ దత్ కీలక పాత్రలలో నటించారు. మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్న సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు అస్సెట్ అయ్యాడు.
ఇదిలా ఉండగా డైరెక్టర్ లోకేష్ కనగ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కథ పూర్తయిందని, తలైవాతో సినిమా తీయడం మిగిలి ఉందన్నాడు. ఇప్పటికే స్టోరీని తలైవా రజనీకాంత్ కు వినిపించానని తెలిపాడు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో షూటింగ్ మొదలు పెడతానని అప్ డేట్ ఇచ్చాడు దర్శకుడు.