దుబాయ్ – తమిళ సినీ ఇండస్ట్రీ పరంగా అత్యుత్తమ దర్శకుడిగా అవార్డు దక్కడం ఆనందంగా ఉందన్నారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. లోక నాయకుడిగా గుర్తింపు పొందిన కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా తీశాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ చిత్రం.
తాజాగా దుబాయ్ వేదికగా సైమా అవార్డ్స్ 2023 వేడుక కన్నుల పండువగా సాగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినీ రంగాలకు చెందిన నటీ నటులు, టెక్నీషియన్స్ హాజరయ్యారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.
ఇదిలా ఉండగా సైమా జ్యూరీ కమిటీ సంచలన వ్యాఖ్యలు చేసింది. విక్రమ్ సినిమాను తెర కెక్కించిన విధానం అద్భుతమని పేర్కొంది. అందుకే ఆయనను తమిళ సినీ ఇండస్ట్రీ పరంగా అత్యుత్తమ దర్శకుడిగా ఎంపిక చేయడం జరిగిందని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా ఇలాంటి అవార్డులు, పురస్కారాలు అందు కోవడం వల్ల కొంత మేరకు మరింత బాధ్యత పెరుగుతుందన్నారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. విక్రమ్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ప్రత్యేకించి కమల్ హాసన్ కీలకమైన పాత్ర పోషించాడని కొనియాడారు.