తమిళ సినీ రంగానికి చెందిన యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దళపతి విజయ్ , త్రిష కృష్ణన్, సంజయ్ దత్, అర్జున్ నటించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. ఇదిలా ఉండగా మిశ్రమ స్పందన వస్తోంది. ఇంకా పూర్తిగా సినిమాకు సంబంధించి వివరాలు అందలేదు.
మొత్తంగా విజయ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన మార్కెట్ కు ఢోకా లేదని ఈ మూవీతో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక సినీ రంగంలో ఏకంగా ఈ ఒక్క సినిమాలో నటించినందుకు రూ. 120 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్.
ఇది పక్కన పెడితే ఆ ఒక్క పది నిమిషాలు సినిమాకు హైలెట్ అని ప్రకటించాడు లోకేష్ కనగరాజ్. తనకు హీరో అజిత్ కుమార్ తో కొత్తగా మూవీ తీయాలని ఉందని స్పష్టం చేశాడు. ప్రస్తుతం దర్శకుడు చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
కాగా విడుదల కాకుండానే లియో చిత్రం రికార్డుల మోత మోగించింది. ముందస్తు బుకింగ్ లో అన్ని సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టడం విశేషం.