తమిళ సినీ రంగంలో మోస్ట్ డైనమిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు లోకేష్ కనగరాజ్. తనతో తాను నటిస్తున్నట్టు కన్ ఫర్మ్ చేశాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఖైదీ, విక్రమ్ , లియో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన కనగరాజ్ కు ఉన్నట్టుండి బంపర్ ఆఫర్ ఇచ్చాడు తలైవా.
తలైవార్ 171 మూవీలో రజనీకాంత్ ను డిఫరెంట్ రోల్ లో చూపించనున్నట్లు ప్రకటించాడు దర్శకుడు. ప్రస్తుతం జ్ఞానవేళ్ తీస్తున్న సినిమాలో బిజీగా ఉన్నాడు తలైవా. లియోను డిఫరెంట్ గా తీశాడు విజయ్ తో. ఈ సందర్బంగా తన మూవీపై కొన్ని బ్యాడ్ కామెంట్స్ రావడంపై కూల్ గా స్పందించాడు.
తాను సినిమా ఎలా తీయాలనే దానిపై మాత్రమే ఫోకస్ పెడతానని, ఎన్ని కలెక్షన్లు వచ్చాయన్నది తాను ఎప్పటికీ పట్టించు కోనంటూ స్పష్టం చేశాడు. కొందరు వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెడతారంటూ పేర్కొన్నాడు. అది వాళ్ల వ్యక్తిగతమని తెలిపాడు.
గతంలో విజయ్ తో మాస్టర్ తీశాడు. తాజాగా లియో అందించాడు. ఓ ఛానల్ లో తో మాట్లాడాడు లోకేష్ కనగరాజ్. అందరూ స్టార్ నెస్ ను రజనీకాంత్ లో చూస్తారని, కానీ ఆయనలో తనకు విలనిజం నచ్చుతుందన్నాడు డైరెక్టర్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.