Hero Rajinikanth Coolie :త‌లైవా కూలీ షూటింగ్ క్లోజ్

ప్ర‌క‌టించిన మూవీ మేక‌ర్స్

Coolie : త‌మిళ సినీ రంగంలో తీసింది కొన్ని చిత్రాలే అయినా ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌మ్మున్నోడు. టేకింగ్, మేకింగ్ లో వెరీ స్పెష‌ల్. త‌న‌కు కావాల్సింది వ‌చ్చేంత వ‌ర‌కు ఎవ‌రైనా స‌రే వినాల్సిందే. అందుకే త‌న ప‌నితీరు న‌చ్చ‌డంతో కోట్లాది మంది అభిమానుల‌ను క‌లిగిన త‌లైవా ర‌జ‌నీకాంత్(Rajinikanth) పిలిచి మ‌రీ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఎవ‌రైనా ఓ సినిమా అంత‌గా ఆడ‌క పోతే స‌ద‌రు డైరెక్ట‌ర్ ను ప‌క్క‌న పెడ‌తారు. కానీ ర‌జ‌నీ అలా కాదు. గ‌తంలోనూ క‌బాలీ తీసిన పా రంజిత్ కు మ‌రో మూవీ చేసేందుకు అవ‌కాశం ఇచ్చాడు.

Coolie Cinema Shooting Updates

త‌న రూటు స‌ప‌రేట్. అందుకే ర‌జ‌నీకాంత్ సూప‌ర్ స్టార్ అయ్యాడు. క‌థ న‌చ్చిందా ఇక ఎవ‌రి మాట విన‌డు. ఓకే చెప్ప‌డం, షూటింగ్ లోకి దిగి పోవ‌డం ష‌రా మామూలే. అయితే ఆయ‌న‌కు హిమాల‌యాలతో పాటు క‌ర్నూల్ జిల్లాలోని మంత్రాల‌యంలోని రాఘ‌వేంద్ర స్వామి మ‌ఠాన్ని సంద‌ర్శించ‌డం అల‌వాటు. త‌లైవా కు కోట్లున్నా, త‌న రేంజ్ ఇండియాను దాట‌వేసినా సింపుల్ గా ఉంటాడు. ఉండేందుకు ప్ర‌య‌త్నం చేస్తాడు. ఆ మ‌ధ్య‌న క‌న్న‌డ సూప‌ర్ స్టార్ శివ రాజ్ కుమార్ తో క‌లిసి క‌నిపించాడు. ఇద్ద‌రూ మోస్ట్ పాపుల‌ర్ హీరోస్. కానీ అత్యంత సాధార‌ణంగా ఎలా ఉండాలో వారిని చూసి నేర్చుకున్నాన‌ని అన్నాడు ఓ సినీ డైరెక్ట‌ర్.

ఇది ప‌క్క‌న పెడితే తాజాగా ర‌జ‌నీకాంత్ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం కూలీ(Coolie). దీనిని లోకేష్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కించాడు. తాజాగా మూవీ మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌ట‌న చేశారు. అదేమిటంటే త‌లైవాతో తీసిన మూవీ షూటింగ్ ముగిసిందని. ఇందులో ర‌జ‌నీకాంత్ తో పాటు శ్రుతీ హాస‌న్ , నాగార్జున‌, ఉపేంద్ర‌, స‌త్య‌రాజ్ , సౌబిన్ ష‌బీర్ న‌టిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పుడు రిలీజ్ చేసిన గ్రూప్ ఫోటో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

Also Read : Hero Kalyan Ram-Vijayasanthi :రాముల‌మ్మ నాకు త‌ల్లి లాంటిది

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com