తమిళ సినీ రంగానికి చెందిన మోస్ట్ పాపులర్ యంగ్ , డైనమిక్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా తీయనున్నట్లు అప్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం విజయ్ తలపతితో లియో చిత్రం విడుదలకు రెడీ అయ్యింది. అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు మూవీ మేకర్స్ డిసైడ్ చేశారు.
మరో వైపు స్టార్ ఇండియా డైరెక్టర్ గా పేరు పొందిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ ఈ ఏడాదే విడుదల కానుంది. ఇందులో శ్రుతీ హాసన్ నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా లోకేష్ కనగరాజ్ సంచలన ప్రకటన చేశారు. ప్రభాస్ తో తన సినిమా ఉంటుందన్నారు.
అయితే గతంలో తాను తీసిన సినిమాల కంటే భిన్నంగా డార్లింగ్ మూవీ ఉండబోతోందని స్పష్టం చేశారు దర్శకుడు. ప్రస్తుతం లోకేష్ చేసిన ప్రకటన సినీ వర్గంలో కలకలం రేపుతోంది. అయితే ప్రభాస్ లోకేష్ కనగరాజ్ తో తన సినిమా ఉంటుందన్న దానిపై ఇంకా ప్రకటన చేయలేదు.