తమిళ సినీ ఇండస్ట్రీలో యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు లోకేష్ కనగరాజ్. తను తాజాగా సూపర్ స్టార్ దళపతి జోసెఫ్ విజయ్ తో తీసిన లియో అక్టోబర్ 19న రిలీజ్ అయ్యింది. మిశ్రమ స్పందన వచ్చినా రాను రాను రికార్డుల మోత మోగిస్తోంది ఈ మూవీ. తొలి రోజు ఇప్పటి వరకు ఆది పురుష్ మూవీపై ఉన్న రికార్డ్ ను బ్రేక్ చేసింది. నాలుగు రోజులకు గాను రూ. 400 కోట్లు కలెక్షన్స్ రావడం విస్తు పోయేలా చేసింది.
అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడు. విజయ్ , త్రిష కృష్ణన్ , సంజయ్ దత్ , అర్జున్ కీలక పాత్రల్లో నటించారు. సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ఆశించిన దానికంటే ఎక్కువగా ఆదరణ పొందాయి. రజనీకాంత్ తో పాటు విజయ్ కు భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇక లోకేష్ కనగరాజ్ కు ఇది రెండో సినిమా జోసెఫ్ విజయ్ తో. నెల్సన్ దిలీప్ కుమార్ బీస్ట్ తీశాడు. ఆ తర్వాత వారిసులో నటించాడు తళపతి. కానీ అంతగా తనను సంతోషించేలా ఆడక పోవడంతో కొంచెం నిరాశకు గురయ్యాడు. కానీ మనసు పెట్టి నటించాడు లియో మూవీలో.
స్వీట్ బ్లడ్ అనే క్యాప్షన్ తో లియో డైరెక్టర్ ఇచ్చిన క్యాప్షన్స్ ఫ్యాన్స్ ను పిచ్చెక్కించేలా చేశాయి. తాజాగా లియో సక్సెస్ సందర్బంగా కేరళను సందర్శించాడు లోకేష్ కనగరాజ్. ఆయనకు భారీ ఎత్తున ఆదరణ లభించింది.