Mammootty: మమ్ముట్టితో విభేదాలపై స్పందించిన దర్శకుడు లింగుస్వామి !

మమ్ముట్టితో విభేదాలపై స్పందించిన దర్శకుడు లింగుస్వామి !

Hello Telugu - Mammootty

Mammootty: ‘పందెం కోడి’, ‘ఆవారా’ చిత్రాలతో దర్శకుడిగా తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి. రామ్‌ హీరోగా నటించిన ‘ది వారియర్‌’ తో ఆయన తెలుగువారికి చేరువయ్యారు. ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తొలి చిత్రం ‘ఆనందం’ షూట్‌ లో జరిగిన ఘటనలపై స్పందించారు. మమ్ముట్టి(Mammootty)తో విభేదాలంటూ అప్పట్లో వచ్చిన కథనాల గురించి దాదాపు 23 ఏళ్ల తర్వాత ఆయన పెదవివిప్పారు.

Mammootty…

‘‘ఆనందం’తో నేను దర్శకుడిగా తొలి అడుగు వేశా. అందులో మమ్ముట్టి(Mammootty) హీరో. ఆ సినిమా షూట్‌ లో ఏదైనా సమస్యలు తలెత్తితే అది పూర్తిగా నా వల్లేనని భావిస్తున్నా. అప్పుడు నాకు ఇండస్ట్రీ కొత్త. అన్ని విషయాల్లో కచ్చితంగా ఉండేవాడిని. కానీ, ఆయనకు ఎన్నో చిత్రాల్లో నటించిన అనుభవం ఉంది. ఆయన ఇచ్చిన సలహాలు నేను పాటించాల్సింది. ఆయన కోపం క్షణకాలం మాత్రమే ఉంటుంది. ఏదీ మనసుకు తీసుకోరు. ఇప్పటికీ ఆయనతో మాట్లాడుతున్నా. ‘భ్రమయుగం’ ట్రైలర్‌ చూశాక ఫోన్‌ చేసి చాలా బాగుందన్నా. ఆ స్థాయిలో ఉండి ‘కాదల్‌-ది కోర్‌’ లాంటి చిత్రాన్ని ఎవరు చేయగలరు ? అని చెప్పా. దానికి ఆయన ఎలాంటి పాత్రలోనైనా నటించాలనే తపన ప్రతి ఒక్కరికీ ఉండాలని… అప్పుడే గొప్ప సినిమాలు వస్తాయని బదులిచ్చారు’’ అని తెలిపారు.

ఇదే ఇంటర్వ్యూలో కమల్‌ హాసన్‌ హీరోగా తాను నిర్మించిన ‘ఉత్తమ విలన్‌’ వల్ల ఆర్థికంగా నష్టపోయానని లింగుస్వామి చెప్పారు. ఆ సినిమా ఫైనల్‌ కాపీ చూసి కొన్ని మార్పులు సూచించానని… కమల్‌ వాటిని పట్టించుకోలేదన్నారు. ‘‘ఉత్తమ విలన్‌’ వల్ల మేం భారీగా నష్టపోయాం. అందుకు పరిహారంగా రూ. 30 కోట్ల బడ్జెట్‌ లో మాతో ఒక సినిమా చేస్తానని కమల్‌ మాటిచ్చారు. కథ కూడా చెప్పారు. ప్రతి వారం కథ మార్చేస్తుండేవారు. ఆయనతో మేం ‘దృశ్యం’ రీమేక్‌ చేయాలనుకున్నాం. అంగీకరించలేదు. అదే చిత్రాన్ని వేరే నిర్మాణసంస్థలో చేశారు’’ అని షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

Also Read : Ritu Varma: ప్రియదర్శి, నభానటేశ్‌ కు రీతూవర్మ స్ట్రాంగ్ వార్నింగ్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com